విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమ్ముకాశ్మీర్‌కు సంబంధించి 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టికల్ 370 చట్ట సవరణ ఆర్డినెన్స్‌తో పాటు జమ్ముకాశ్మీర్ రిజర్వేషన్ చట్టసవరణను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని ప్రకారం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. అటు అంతర్జాతీయ సరిహద్దు, ఎల్వోసీ దగ్గర నివసించే ప్రజలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నారు.
కేంద్ర కేబినెట్ ఇతర నిర్ణయాలు ఇవే:
ఢిల్లీ ఎయిమ్స్ని ప్రపంచస్థాయి యూనివర్సిటీగా తీర్చిద్దాలని నిర్ణయం
2 కారిడార్లతో ఆగ్రా మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం
రూ.8వేల కోట్లతో 14 కి.మీ. మేర 14 స్టేషన్లతో ఆగ్రా మెట్రో
2 కారిడార్లతో కాన్పూర్ మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం
23 కి.మీ. కాన్పూర్ మెట్రోను ఐదేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయం
హర్యానాలోని మనేధిలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
హిరసార్, రాజ్‌కోట్‌లో గ్రీన్ ఫీల్డ్స్ విమానాశ్రయాలకు ఆమోదం
బ్రహ్మపుత్ర నదిపై 4 లైన్ల రోడ్డు నిర్మాణం
నేపాల్‌లోని అరుణ్-3 హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌కు సట్లెజ్ జల్ వికాస్ నిగమ్ ద్వాకా విద్యుత్ పరికరాల సరఫరా
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.