ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో..దేశంలో 100 సైనిక్ సూల్స్ స్థాపనకు కేంద్ర కేబినేట్ ఆమోదం..

ప్రధాని మోదీ (Photo: ANI / Twitter)

పిల్లల్లో ఉన్నత విద్య, క్రమశిక్షణ వంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో సైనిక్ స్కూల్స్ సొసైటీతో ప్రభుత్వ , ప్రైవేట్ భాగస్వామ్యంతో 100 పాఠశాలలను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.

 • Share this:
  పిల్లల్లో ఉన్నత విద్య, క్రమశిక్షణ వంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో సైనిక్ స్కూల్స్ సొసైటీతో ప్రభుత్వ , ప్రైవేట్ భాగస్వామ్యంతో 100 పాఠశాలలను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదన ఆమోదించింది. ఈ పాఠశాలలు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రస్తుత సైనిక్ పాఠశాలల కన్నా విభిన్నంగా పనిచేస్తాయని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.

  "మొదటి దశలో, 100 అనుబంధ భాగస్వాములను రాష్ట్రాలు/NGO లు/ప్రైవేట్ భాగస్వాములు నుండి తీసుకోవాలని ప్రతిపాదించబడినట్లు" ప్రకటనలో పేర్కొంది. 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభం నుండి 100 అనుబంధ పాఠశాలల్లో దాదాపు 5,000 మంది విద్యార్థులు 6వ తరగతిలో ప్రవేశం పొందేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సైనిక్ పాఠశాలలు పిల్లలకు విలువ ఆధారిత నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, సాధారణ నేపథ్యాల నుండి అత్యున్నత స్థాయికి చేరుకున్న విద్యార్థుల గర్వించదగిన చరిత్రను అందిస్తాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయ పడింది. ఈ కారణంతోనే కొత్త సైనిక్ స్కూల్స్ ఎక్కువ సంఖ్యలో తెరవాలనే డిమాండ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంది.

  ప్రకటన ప్రకారం, సైనిక్ స్కూల్ సొసైటీతో అనుబంధంగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలలు/NGO ల నుండి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 సైనిక్ స్కూల్స్ , అడ్మినిస్ట్రేటివ్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి 100 కొత్త అనుబంధ సైనిక్ పాఠశాలలను స్థాపించాలని నిర్ణయించారు.
  Published by:Krishna Adithya
  First published: