Union Budget 2023 : దేశ ప్రజలే కాదు.. ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా చూస్తున్న సాధారణ బడ్జె్ట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం.. నిర్మలా సీతారామన్... ఉదయం 9 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారు. కాసేపు మాట్లాడిన తర్వాత రాష్ట్రపతి బడ్జెట్‌కి ఆమోదం తెలుపుతారు. అక్కడితో ఓ లాంఛనప్రాయ ఘట్టం పూర్తవుతుంది. ఉదయం 10 గంటల సమయంలో నిర్మలా సీతారామన్.. పార్లమెంట్‌కి చేరుకుంటారు. వెంటనే కేంద్ర కేబినెట్ మంత్రులతో సమావేశం అవుతారు. ఆలస్యం లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్న కేంద్ర మంత్రివర్గం.. బడ్జెట్‌ని 10.30కి ఆమోదిస్తుంది.
ఆ తర్వాత నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వస్తారు. బడ్జె్ట్ బ్రీఫ్‌తో కనిపించి.. లోక్‌సభలోకి వెళ్తారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. ఇది పేపర్ లెస్ బడ్జెట్ కాబట్టి.. ఎక్కువ టైమ్ పట్టదు. మధ్యాహ్నం ఒంటిగంట లోపే బడ్జెట్ ప్రసంగం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రెండు సభలూ గురువారానికి వాయిదా పడతాయి. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ప్రక్రియ మొదలవుతుంది.
ఆర్థిక సర్వేని బట్టీ ఈసారి బడ్జె్ట్‌పై ఒకింత భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఎన్నికల ఏడాది కావడం... అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు కాబట్టి.. ఈసారి బడ్జెట్‌పై అంచనాలు పెంచుకున్నారు దేశ ప్రజలు. ఐతే.. ఈసారి పద్దు కూడా మరీ అంత ఆకర్షణీయంగా ఉండదనీ.. ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి.. ఆ ప్రభావం మన దేశ పద్దుపైనా ఉంటుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రక్షణ రంగం, రైల్వేల వంటివి వాటికి భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఈ సస్పెన్స్‌కి మరికొన్ని గంటల్లో తెర పడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget, Budget 2023, Nirmala sitharaman