Budget 2023 : మరి కొన్ని గంటల్లో పార్లమెంట్ బడ్జె్ట్ సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. ఇవాళ రెండు సభలనూ ఉద్దేశించి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇవాళ, రేపు.. జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండవు. అందువల్ల రాష్ట్రపతి ప్రసంగం తర్వాత... దేశ ఆర్థిక పరిస్థితిని చెప్పే ఆర్థిక సర్వేను రెండు సభల్లో ప్రవేశ పెడతారు. ఈ సర్వే ప్రకారం.. రేపటి బడ్జెట్ ఎలా ఉండబోతోంది అనే దానిపై కొన్ని అంచనాలు వేసుకునే వీలు ఉంటుంది. ఇక రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. సాధారణ బడ్జెట్‌ను ముందుగా లోక్‌సభలో తర్వాత రాజ్యసభలో ప్రవేశ పెడతారు. ఇక గురువారం రెండు సభలూ... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చను ప్రారంభిస్తాయి. ఈ చర్చకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రెండు సభల్లోనూ సమాధానాలు ఇస్తారు.
ఈ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని నిన్న కేంద్రం.. అన్ని పార్టీల సమావేశంలో ప్రతిపక్షాలను కోరింది. ఈ సమావేశాలకు 27 పార్టీల తరపున 37 మంది సభ్యులు రాగా... కాంగ్రెస్ రాలేదు. చైనా ఆక్రమణలపై చర్చ జరగాలని బీఎస్పీ కోరింది. ఇప్పుడు అది కుదరదన్న కేంద్రం.. ఈసారి బడ్జెట్‌పై చర్చించడం కీలకం అని తెలిపింది. అలా అంటూనే.. నిబంధనల ప్రకారం ఏ అంశంపైనైనా చర్చకు అనుమతిస్తామని తెలిపింది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ, RJD... వ్యాపారవేత్త అదానీ అంశంపై చర్చించాలని కోరాయి. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని వైసీపీ కోరింది. వీటిపై కేంద్రం పాజిటివ్‌గా స్పందించలేదు.
ఇది కూడా చదవండి : Money Astrology : జనవరి 31 ధన జ్యోతిష్యం .. వీరు లాభాలు పొందుతారు
ఈసారి బడ్జెట్ సమావేశాల తొలి దశ... జనవరి 31న మొదలై... ఫిబ్రవరి 13 వరకూ ఉంటుంది. రెండో దశ... మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకూ ఉంటుంది. మొత్తంగా 27 రోజులు ఈ సమావేశాలు ఉంటాయి. ఇవాళ రేపు జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండదు కాబట్టి ప్రతిపక్షాలు ఏం అడగాలన్నా.. ఫిబ్రవరి 2న జరిగే జీరో అవర్‌లో అడగాల్సి ఉంటుందని పార్లమెంటరీ బులిటెన్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget, Budget 2023, Indian parliament, Parliament