హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Budget 2023 : రేపు పార్లమెంట్ ప్రారంభం.. 1న బడ్జెట్ .. కీ పాయింట్స్

Budget 2023 : రేపు పార్లమెంట్ ప్రారంభం.. 1న బడ్జెట్ .. కీ పాయింట్స్

పార్లమెంట్ భవనం (image credit - PTI)

పార్లమెంట్ భవనం (image credit - PTI)

Budget 2023 : జనవరి 31న పార్లమెంట్ బడ్జె్ట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. దీనిపై ఇవాళ అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఉంటుంది. బడ్జెట్ సమావేశాల్లో చర్చించబోయే అంశాలపై ఈ సమావేశంలో మాట్లాడుకుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Budget 2023 : ఎన్నికల ఏడాదికి ముందు.. అత్యంత కీలకమైన బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు రానుంది. ఇందుకోసం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. జనవరి 31న ప్రారంభమవుతాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇవాళ ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఉంది. ఇందులో ఈసారి బడ్జెట్ వివరాల్ని తెలుపుతారు. సమావేశాలకు సహకరించాల్సిందిగా కేంద్రం.. ప్రతిపక్షాలను కోరుతుంది. రేపు (మంగళవారం) రాష్ట్రపతి ప్రసంగం తర్వాత... ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. అందులో దేశం పరిస్థితి ఎలా ఉంది? విదేశీ మారక నిల్వల సంగతేంటి? ఆర్థికంగా ఎలా ఉన్నాం.. వంటి అంశాలను పొందుపరుస్తారు.

ఫిబ్రవరి 1న బుధవారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ... 2023-2024 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ముందుగా లోక్‌సభలో ప్రవేశపెడతారు. తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు.

ఇక్కడో కీలక విషయం ఉంది. 2024 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల వచ్చే సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం కుదరదు. కాబట్టి.. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్. కాబట్టి.. ఈ బడ్జెట్.. ప్రజలకు నచ్చేలా ఉంటుంది అని కొందరు రాజకీయ నిపుణులు అంచనా వేస్తుంటే... అలా ఏమీ ఉండదు.. సాధారణంగానే ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఆకర్షణీయ పథకాలేవీ ఉండవని కేంద్రం ఆల్రెడీ చెప్పింది కాబట్టి... ఈసారి బడ్జెట్ కూడా వాస్తవాలకు దగ్గరగానే ఉంటుందని అంటున్నారు. దీనిపై ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడం మేలని సూచిస్తున్నారు. ఐతే.. ఈసారి రైల్వేలు, రక్షణ రంగానికి మాత్రం భారీ కేటాయింపులు ఉంటాయి అని తెలుస్తోంది.

ఇక ఈసారి బడ్జెట్ సమావేశాల తొలి దశ... ఈనెల 31న మొదలై... ఫిబ్రవరి 13 వరకూ ఉంటుంది. రెండో దశ... మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకూ ఉంటుంది.

ఈసారి జనవరి 31, ఫిబ్రవరి 1న జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండవు అని తెలిసింది. ప్రతిపక్షాలు ఏం అడగాలన్నా.. ఫిబ్రవరి 2న జరిగే జీరో అవర్‌లో అడగొచ్చని పార్లమెంటరీ బులిటెన్ తెలిపింది. అలాగే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ.. ఫిబ్రవరి 2న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభలో మాట్లాడతారు. అలా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగనుంది.

First published:

Tags: Budget, Budget 2023, Income tax

ఉత్తమ కథలు