హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Union Budget 2022: ఇది ప్రజల బడ్జెట్.. భారత్ భవిష్యత్తును నిర్దేశించేది: PM Modi

Union Budget 2022: ఇది ప్రజల బడ్జెట్.. భారత్ భవిష్యత్తును నిర్దేశించేది: PM Modi

 ప్రధాని మోదీ(File)

ప్రధాని మోదీ(File)

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు స్నేహపూర్వకమైనది, ప్రగతిశీలమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు స్నేహపూర్వకమైనది, ప్రగతిశీలమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరింత అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాలకు నూతన అవకాశాలను తీసుకొచ్చే బడ్జెట్ ఇది అని తెలిపారు.

గడిచిన వందేళ్లలోనే అతిపెద్ద భయానక విపత్తు కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి పట్ల నూతన ఆత్మవిశ్వాసాన్ని ఈ బడ్జెట్ తీసుకొచ్చిందని మోదీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఈ బడ్జెట్ సామాన్యులకు అనేక నూతన అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. పేదల సంక్షేమం ఈ బడ్జెట్‌లో చాలా ముఖ్యమైన అంశమని ప్రధాని చెప్పారు.

Pre-Polls Survey Results: యూపీలో బీజేపీ ఓటమి.. అఖిలేశ్ సీఎం: ఎవరికెన్ని సీట్లంటే..


ప్రతి పేద వ్యక్తికి తప్పనిసరిగా ఓ పక్కా గృహం, కొళాయి నీరు, మరుగుదొడ్డి, గ్యాస్ సదుపాయం ఉండాలన్నారు. ఈ బడ్జెట్‌లో వీటన్నిటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారని తెలిపారు. అదే సమయంలో ఆధునిక ఇంటర్నట్ కనెక్టివిటీపై సమానంగా శ్రద్ధ చూపించారని ప్రధాని చెప్పారు.

Attack on Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్‌పై ఇంకు దాడి.. యాసిడ్ అంటోన్న పార్టీ!ప్రజల నుంచి వస్తున్న స్పందన వారికి మరింత సేవ చేయాలనే తపనను, దృఢనిశ్చయాన్ని బీజేపీలో పెంచిందని మోదీ చెప్పారు. పర్వతమాల స్కీమ్ మన దేశంలో మొదటిసారి అమలవుతోందన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పథకం వల్ల పర్వతాలపై ఆధునిక రవాణా వ్యవస్థ నిర్మితమవుతోందన్నారు.

Vava Suresh: కాపాడబోతే కాటేసిన కోబ్రా. ప్రముఖ Snake Catcher సురేశ్‌ పరిస్థితి విషమం..


అదేవిధంగా ఈ బడ్జెట్‌లో రక్షణ మూలధనం నుంచి 68శాతం దేశీయ పరిశ్రమకు కేటాయించడం వల్ల భారతదేశంలో MSME రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పీపుల్ ఫ్రెండ్లీ, ప్రోగ్రెసివ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందాన్ని అభినందిస్తున్నాను” అని అన్నారు. ఈ బడ్జెట్ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఇస్తుందని అన్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Pm modi, Union Budget 2022

ఉత్తమ కథలు