Home /News /national /

UNION BUDGET 2022 23 WILL BE PAPERLESS AND WILL BE AVAILABLE IN MOBILE APP AFTER PRESENTING IN PARLIAMENT AK

Union Budget 2022-23: మొబైల్ యాప్‌లో కేంద్ర బడ్జెట్.. పూర్తిగా పేపర్ లెస్.. ఈసారి ఆ వేడుక రద్దు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Union Budget 2022-23: కరోనా కాలంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. భారత చరిత్రలో తొలిసారిగా 2021లో బడ్జెట్ పూర్తిగా పేపర్‌లెస్‌గా మారింది.

    కేంద్ర బడ్జెట్ 2022-23 పార్లమెంటులో పెట్టిన తర్వాత మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. అందరికీ కేంద్ర బడ్జెట్ సమాచారాన్ని సులభంగా, త్వరగా అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం "యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్" రూపొందించారు. ఈ మొబైల్ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉంచుతారు. మొబైల్ యాప్‌ను యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ (www.indiabudget.gov.in) నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బడ్జెట్ పత్రాలు సాధారణ ప్రజల కోసం యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ (www.indiabudget.gov.in)లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నామని, కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని బడ్జెట్‌కు సంబంధించిన అధికారిక వర్గాలు తెలిపాయి.

    కరోనా మహమ్మారి, ఆరోగ్య భద్రత సమస్యల కారణంగా హల్వా వేడుకకు బదులుగా ప్రధాన ఉద్యోగులకు స్వీట్లు అందించారు. ఈసారి సాంప్రదాయ హల్వా వేడుక కార్యక్రమం లేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా పూర్తిగా పేపర్ లెస్ బడ్జెట్‌ను రూపొందించనున్నారు. కరోనా కాలంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. భారత చరిత్రలో తొలిసారిగా 2021లో బడ్జెట్ పూర్తిగా పేపర్‌లెస్‌గా మారింది. దాన్ని ప్రింట్ చేయలేదు. ఎంపీలు, ప్రభుత్వ అధికారులందరూ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీన్ని పొందుతారు. 2021లో విడుదల చేసిన ఆర్థిక సర్వే కూడా పూర్తిగా పేపర్‌లెస్‌గా అందుబాటులోకి తీసుకొచ్చారు.

    ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2022న బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ సంవత్సరం బడ్జెట్ సెషన్ జనవరి 29 నుండి ప్రారంభమై ఏప్రిల్ 8, 2022న ముగుస్తుంది.

    Income Tax Slab: ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్‌లో మార్పులు ఉంటాయా ?.. వారిపై 5 శాతం పన్ను ఉంటుందా ?

    Budget 2022: ఎలక్ట్రిక్ వాహనాల కోసం బడ్జెట్ లో ప్రోత్సాహకాలు పెంచండి...కేంద్రానికి CII సూచించిన సూచనలు ఇవే...

    ఇదిలా ఉంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ రఘురామ్ రాజన్ బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచనలు చేశారు. వ్యవసాయం, తయారీ రంగాల సహాయంతో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించాలనే కలలను మాత్రమే వదిలి ఇతర రంగాలపై దృష్టి సారించాలని రాజన్ అన్నారు. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు బడ్జెట్‌లో కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ పలు వ్యాఖ్యలు చేశారు. దేశం తక్షణమే బడ్జెట్ విషయంలో సాంప్రదాయ పద్ధతిని వదిలివేయాలని సూచించారు. ఏటా కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఆయన సూచించారు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి మరీ నిరాశావాదంగా లేదా ఆశాజనకంగా లేదని రాజన్ అభిప్రాయపడ్డారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Budget 2022-23, Union Budget 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు