Home /News /national /

UNION BUDGET 2021 WHAT CAN EXPECT FROM FINANCE MINISTER NIRMALA SITHARAMAN ON FEB 1ST BUDGET BA

Union Budget 2021: కేంద్ర బడ్జెట్‌లో ఏమేం ఉండవచ్చు?, మూడు ముఖ్యమైన అంశాలు

నిర్మలా సీతారామన్(ఫైల్ ఫొటో)

నిర్మలా సీతారామన్(ఫైల్ ఫొటో)

బ్యాంకుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను నాలుగు బ్యాంకులకు కుదించే ప్రయత్నం చేయొచ్చంటున్నారు.

    కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సారి మొత్తం డిజిటల్ బడ్జెట్. ఎలాంటి పేపర్లు ఉండవు. పేపర్ ప్రింటింగ్ మొత్తం రద్దు చేసి నేరుగా అందరు సభ్యులకు డిజిటల్ కాపీలను అందజేస్తారు. కరోనా వైరస్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆదాయంలో తగ్గుదల కనిపించింది. రెండో అర్ధభాగంలో కొంత మెరుగైనా కూడా అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదు. ఈ క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఎలాంటి అంశాలు ఉంటాయా? అని సామాన్యులతో పాటు వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

    సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు సంబంధించి కీలక నిర్ణయం ఉండొచ్చు. క్యాపిటల్ గెయిన్ విషయంలో ముఖ్యమైన ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. విదేశంలో కట్టిన ట్యాక్స్ కూడా మదింపుదారుడి ఆదాయంగానే పరిగణిస్తారు. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 198 ప్రకారం, సోర్స్ తగ్గించబడిన పన్నును అంచనా వేసేవారి స్థూల మొత్తం ఆదాయంలో చేర్చాలి. ఏదేమైనా, భారతదేశం వెలుపల పన్నులు నిలిపివేయబడితే, సంబంధిత ఆదాయాన్ని భారతదేశంలో పన్నుకు ఇస్తే ఆదాయ గణన తరచుగా వివాదాస్పదమవుతుంది. ఈ విషయంలో స్పష్టమైన నిబంధన లేనప్పుడు, మదింపుదారుడు అతని స్థూల మొత్తం ఆదాయానికి నికర ఆదాయాన్ని కలిగి ఉంటాడు. కాగా అంచనా వేసే అధికారి స్థూల మొత్తాన్ని అంచనా వేస్తాడు.డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌లో మార్పులు రావాలని వ్యాపారవర్గాలు కోరుతున్నాయి.

    కరోనా వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి కేంద్ర ప్రయత్నాలు చేయనుంది. కరోనా వల్ల ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని వల్ల జరిగిన నష్టాలకు ఉపశమనం కలిగించేలా, కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక నిర్ణయం ఉంటుందని వారు ఆశిస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ట్యాక్స్ విషయంలో వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

    ఇక బ్యాంకుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను నాలుగు బ్యాంకులకు కుదించే ప్రయత్నం చేయొచ్చంటున్నారు. ఇప్పటికే 27 బ్యాంకులను దశల వారీగా విలీనం చేస్తూ పెద్ద పెద్ద బ్యాంకులుగా మార్చాయి. ప్రస్తుతం 12 బ్యాంకులు ఉన్నాయి. వాటిని కూడా విలీనం చేస్తూ కేవలం నాలుగు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు తగ్గించొచ్చు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Budget 2021, Nirmala sitharaman, Union Budget 2021

    తదుపరి వార్తలు