• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • UNION BUDGET 2021 WE WANT MORE PUBLIC SECTOR BANKS WHICH ARE FUNCTIONALLY STRONG SAYS FINANCE MINISTER NIRMALA SITHARAMAN MS

Budget 2021: ప్రజల అవసరాలు తీర్చి.. దేశ వృద్ధికి తోడ్పాటునందించే బ్యాంకులనే మేము కోరుకుంటున్నాం : నిర్మలా సీతారామన్

Budget 2021: ప్రజల అవసరాలు తీర్చి.. దేశ వృద్ధికి తోడ్పాటునందించే బ్యాంకులనే మేము కోరుకుంటున్నాం : నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

FM To Network 18: తాము ప్రభుత్వ రంగ బ్యాంకులు పెరగాలని కోరుకుంటున్నామని అన్నారు. అయితే అవి ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉండాలే గానీ.. అందుకు తగ్గ సామర్థ్యం లేకుండా ఉంటే వాటివల్ల ఎవరికి ఉపయోగమని తెలిపారు.

  • News18
  • Last Updated:
  • Share this:
    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో భాగంగా.. మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నామని చెప్పిన విషయం విదితమే. అయితే దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఎల్ఐసీని కాపాడాలని ఇప్పటికే ఆయా సంస్థల ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా నిర్మలమ్మ వాటిని ప్రైవేట్ పరం చేయనున్నారనే సూచనలతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. దీనిపై ఆమె స్పందించారు. న్యూస్ 18 కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె దీనిపై క్లారిటీ ఇచ్చారు. నెట్ వర్క్ 18 ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషి ఆమెను ఇంటర్వ్యూ చేశారు.

    ఈ సందర్భంగా నిర్మలా స్పందిస్తూ... తాము ప్రభుత్వ రంగ బ్యాంకులు పెరగాలని కోరుకుంటున్నామని అన్నారు. అయితే అవి ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉండాలే గానీ.. అందుకు తగ్గ సామర్థ్యం లేకుండా ఉంటే వాటివల్ల ఎవరికి ఉపయోగమని తెలిపారు. పన్ను చెల్లింపు దారులు ఇలాంటి సామర్థ్యం తక్కువగా ఉన్న బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టడం కూడా సమంజసం కాదని ఆమె అన్నారు.





    వృత్తిపరంగా బలంగా ఉండి, సమర్థవంతమైన నిర్వహణ ఉన్న బ్యాంకులనే తాము కోరకుంటున్నామని సీతారామన్ అన్నారు. అలాంటి బ్యాంకులే దేశ ఆర్థిక రంగ ప్రగతికి ఊతమిస్తాయని నిర్మలా తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు ఒకటి, రెండు బ్యాంకులు ఉంటే సరిపోదని.. వాటిని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు