కరోనా కాలంలో దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు. దేశంలో అత్యల్ప సదుపాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆరోగ్యరంగానికి ఊతమందించేందుకు మోడీ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని ఆమె చెప్పకనే చెప్పారు. ఇందుకు గానూ ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలలో ఈ విషయం స్పష్టమవుతున్నది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ లో వైద్య రంగానికి కేటాయింపులు ఏకంగా 136 శాతం పెరగడం గమనార్హం. ఆరోగ్యరంగమంటే ఆస్పత్రులను నిర్మించి ఇవ్వడమొక్కటే కాదని.. వైద్య వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరముందని ఆమె స్పష్టం చేశారు. న్యూస్ 18 తో ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె మాట్లాడారు.
నిర్మలా సీతారామన్ స్పందిస్తూ... ఈ ఏడాది బడ్జెట్ లో వైద్య రంగానికి రూ. 2 లక్షల 23 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇది గతేడాదితో పోలిస్తే 136 శాతం అధికమని వివరించారు. గతేడాది వైద్యరంగానికి రూ. 94,452 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
#EXCLUSIVE - Finance Minister Nirmala Sitharaman (@nsitharaman) speaks to @Network18Group Editor-in-Chief @18RahulJoshi #BudgetWithNews18 | #FMtoNetwork18 https://t.co/NIgKWv8cCp
— News18 (@CNNnews18) February 1, 2021
ఇక ఇందులో కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక నిధిని కేటాయించారు. రూ. 84,160 కోట్లను ప్రధానమంత్రి ఆత్మ నిర్భర భారత్ కు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కేటాయింపులను వచ్చే ఆరేళ్లలో ఖర్చు చేయనున్నారు. దీనికింద దేశంలో వైద్య వ్యవస్థ రూపురేఖలే మారనున్నాయి. పబ్లిక్ హెల్త్ యూనిట్, ఎమర్జెన్సీ యూనిట్, మూడంచల వైద్య విధానం, కొత్త ఆస్పత్రుల నిర్మాణం, న్యూట్రీషన్ ప్రాజెక్టులు.. తదితర సేవలను కల్పించనున్నారు. న్యూట్రీషన్ ప్రాజెక్టు 112 జిల్లాకు లబ్ది చేకూర్చనుంది.
వీటితో పాటు దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లను నెలకొల్పుతున్నట్టు ఆమె ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నా.. సీతారామన్ మాత్రం ఇది ప్రజల బడ్జెట్ అని.. దేశ వృద్ధి కోసమే దీనిని రూపొందించామని చెప్పుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2021, Health, Health care, Nirmala sitharaman, Union Budget 2021