హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Budget 2021: రైతుల కోసం బడ్జెట్‌లో కేంద్రం మరో భారీ సాయం? 

Budget 2021: రైతుల కోసం బడ్జెట్‌లో కేంద్రం మరో భారీ సాయం? 

నిర్మలా సీతారామన్(ఫైల్ ఫొటో)

నిర్మలా సీతారామన్(ఫైల్ ఫొటో)

అగ్రికల్చర్ క్రెడిట్‌ను ప్రతి సంవత్సరం పెంచుతోంది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఆయా ఆర్థిక సంవత్సరాల్లో టార్గెట్ విధించిన దాని కంటే ఎక్కువగానే లక్ష్యాలను చేరుకుంటోంది. 2017- 18 ఆర్థిక సంవత్సరానికి రూ.10 లక్షల కోట్ల అగ్రి క్రెడిట్ లక్ష్యాన్ని విధించారు.

ఇంకా చదవండి ...

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అగ్రి క్రెడిట్ టార్గెట్ రూ.19 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం అగ్రి క్రెడిట్ టార్గెట్ రూ.15 లక్షల కోట్లు. అంటే సుమారు 25 శాతం కంటే ఎక్కువగా అగ్రి క్రెడిట్ లిమిట్ పెంచడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి క్రెడిట్ టార్గెట్‌ను పెంచుతూనే ఉంది. ఈసారి దాన్ని  రూ.19 లక్షల కోట్లకు పెంచనుందని ప్రభుత్వంలోని అత్యంత సన్నిహిత వర్గాలు చెప్పాయి. ‘నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCs), కో ఆపరేటివ్ సొసైటీలు అగ్రికల్చర్ క్రెడిట్ విభాగంలో యాక్టివ్‌గా ఉన్నాయి. నాబార్డ్ రీ ఫైనాన్స్ స్కీమ్ మరింత విస్త్రతం కానుంది. 2020 -21 ఏడాదికి సంబంధించి అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ రూ.15 లక్షల కోట్లుగా ఉంది.’ అని 2020-21 బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

అగ్రికల్చర్ క్రెడిట్‌ను ప్రతి సంవత్సరం పెంచుతోంది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఆయా ఆర్థిక సంవత్సరాల్లో టార్గెట్ విధించిన దాని కంటే ఎక్కువగానే లక్ష్యాలను చేరుకుంటోంది. 2017- 18 ఆర్థిక సంవత్సరానికి రూ.10 లక్షల కోట్ల అగ్రి క్రెడిట్ లక్ష్యాన్ని విధించారు. అయితే, ఆ సంవత్సరం లక్ష్యాన్ని మించి రూ.11.68 లక్షల కోట్ల రుణాలను రైతులకు ఇచ్చారు. అలాగే, 2016-17 సంవత్సరానికి చూసుకుంటే, క్రాప్ లోన్ క్రెడిట్ టార్గెట్ రూ.9 లక్షల కోట్లు కాగా, అది వాస్తవంలో రూ.10.66 లక్షల కోట్లకు చేరింది.

రుణాలు లభించడం ద్వారా రైతులకు పంట వేయడానికి చేతిలో డబ్బు సమకూరుతుంది. ఉత్పత్తి కూడా పెరుగుతుంది. వ్యవస్థీకృతమైన క్రెడిట్ విధానం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ఇతర వడ్డీ వ్యాపారుల వైపు చూసే బాధ తప్పుతుంది. అధిక వడ్డీలు కూడా తగ్గుతాయి. సహజంగా వ్యవసాయ రుణాలకు 9 శాతం వడ్డీ పడుతుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం తక్కువ కాలానికి రుణాలు తీసుకునే వారికి వడ్డీ రాయితీ అందిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం రైతు రుణాలప 2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తోంది. ఇలాంటి రుణాలు సుమారు రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటాయి. అంటే సాధారణంగా 9 శాతం వడ్డీ పడే చోట రైతులకు 7 శాతం వడ్డీకి రుణం లభిస్తుంది. అదే సమయంలో రైతులు సకాలంలో వారి రుణాలను చెల్లిస్తే వారికి 3 శాతం ఇన్సెంటివ్ ఇస్తారు. అంటే సకాలంలో రుణాలు చెల్లించేవారికి కేవలం 4 శాతానికే రుణం లభిస్తుందన్నమాట.

First published:

Tags: Budget 2021, Farmers, Union Budget 2021

ఉత్తమ కథలు