Home /News /national /

UNION BUDGET 2020 YSRCP MP VIJAYASAI REDDY EXPRESSED HIS UNHAPPINESS OVER UNION BUDGET 2020 AK

Union Budget 2020: కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ అసంతృప్తి

విజయసాయిరెడ్డి (File)

విజయసాయిరెడ్డి (File)

ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు లేవని... ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్ట్‌ కూడా ఇవ్వలేదని విజయసాయిరెడ్డి అన్నారు.

    కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత... కేంద్ర బడ్జెట్‌ తమకు నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు. వ్యవసాయంపై ఆధారపడ్డ ఏపీకి బడ్జెట్‌ నిరుపయోగమని ఆయన పెదవి విరిచారు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదన్న విజయసాయిరెడ్డి... బడ్జెట్‌లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని అన్నారు. డిపాజిటర్ల బీమ లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం మంచి పరిణామమని అన్నారు. వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇ‍వ్వాలని ఆయన కోరారు.

    రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం... ఆ విధానంలో స్పష్టత ఇవ్వలేదని విజయసాయిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ త్వరితగతిన నిధులు కేటాయించాలని కోరారు., వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని... నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించిందని ఆరోపించారు. పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివపక్షతతో చూడటం మంచిది కాదని సూచించారు.

    ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు లేవని... ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్ట్‌ కూడా ఇవ్వలేదని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాతో పాటు కీలక అంశాలను ప్రస్తావించలేదని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో విద్యపై జీఎస్టీ 18% చాలా ఎక్కువన్న విజయసాయిరెడ్డి... మౌలిక వసతులకు బడ్జెట్ ఎలా సమకూరుస్తారనే దానిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఒక కొత్త రైలు ప్రాజెక్టు కూడా ఇచ్చినట్లు మాకు సమాచారం లేదని... ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ పోర్టులను అభివృద్ధికి సరిపడ నిధులు ఇవ్వాలని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Union Budget 2020, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు