హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Union Budget : ఈసారి బడ్జెట్ అంతంత మాత్రమేనా... అంచనాలు తారుమారేనా...

Union Budget : ఈసారి బడ్జెట్ అంతంత మాత్రమేనా... అంచనాలు తారుమారేనా...

పియూష్ గోయల్

పియూష్ గోయల్

Union Budget 2019 : సాధారణంగా ఎన్నికల సమయంలో బడ్జెట్ అంటే ఓ రేంజ్ ఉంటుందని అందరూ ఆశలు పెట్టుకుంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఓట్ల కోసం గాలం వెయ్యడానికి జనరంజక బడ్జెట్ తేవడం సాధారణం. ఈసారి మాత్రం అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. అంచనాలు పెంచేయకుండా వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ఉంటుందని తెలిసింది.

ఇంకా చదవండి ...

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగే ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడంతో బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయి. దేశంలో పరిస్థితులు, పాలనా వ్యవహారాలపై ఆయన ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 13 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్... ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అందువల్ల ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో ఎన్నికలకు ముందు పరిమిత కాలంలో ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన అంశాలపైనే బడ్జెట్ ఉంటుంది.


నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. తక్కువ కాలానికి సంబంధించిన బడ్జెట్ కావడం వల్ల ఇందులో కీలక అంశాలు, ముఖ్యమైన నిర్ణయాలు ఏవీ లేవని తెలుస్తోంది. ఎన్నికల ఏడాది కదా అని అడ్డమైన హామీలు ఇచ్చి... తమను మోసం చేస్తున్నారనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేలా చేసే బదులు... ఏం చెయ్యదలిచారో ఆ విషయాల్ని మాత్రమే బడ్జెట్‌లో చెప్పాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బడ్జెట్ లేదని సమాచారం. బడ్జెట్‌ని చూసి జనం ఓట్లు వేయరనీ, ఐదేళ్ల పాలనను చూసే ఓట్లు వేస్తారని భావిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం... ఈసారి బడ్జెట్‌ను అత్యంత సాధారణ అంశాలతో సిద్ధం చేసినట్లు తెలిసింది. పన్ను పరిమితులు సహా... కీలక అంశాలు వేటినీ కేంద్రం పెద్దగా టచ్ చేయలేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.


రాఫెల్ రచ్చ తప్పదా : ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. పైగా ఈ సమావేశాల్లోనే రాఫెల్ డీల్‌పై కాగ్ రిపోర్ట్ ఇస్తుందని సమాచారం. ఆ రిపోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే... కాంగ్రెస్ ఎత్తుగడలు ఫలించనట్లే. అదే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే... కాంగ్రెస్ ఈ పరిస్థితిని మరింతగా క్యాష్ చేసుకునే అవకాశాలున్నాయి.

నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మచ్చ ఏదైనా ఉందా అంటే... అది రాఫెల్ డీలే అన్నది విశ్లేషకుల మాట. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించి, తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ మాత్రం సుప్రీంకోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చినా, బురద చల్లే కార్యక్రమం కొనసాగిస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడుతోంది. ఈ పరిణామాలు పార్లమెంట్ సమావేశాలను సజావుగా జరగకుండా చేసే అవకాశాలున్నాయి.

Viral Video: మూడేళ్ల పిల్లాడు నిరసన తెలుపుతాడట.. పోలీసుల ఓవరాక్షన్

First published:

Tags: Lok Sabha Election 2019, Union Budget 2019

ఉత్తమ కథలు