UNION BUDGET 2019 INDIA WILL VISHAKA RAILWAY ZONE INCLUDE IN UNION BUDGET 2019 AP HOPES ON PM MODI AK
#Union Budget 2019: ఈ సారైనా విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన ఉండేనా ? ప్రధాని మోదీ కరుణిస్తారా ?
ప్రతీకాత్మక చిత్రం
Union Budget 2019: కేంద్ర బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపేయడంతో... ఇప్పుడు రైల్వే బడ్జెట్‌కు అంతగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. అయితే తమ రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్టుల విషయంలో చాలామందిలో ఇప్పటికీ ఆసక్తి ఉంది. ఏపీ ప్రజల్లోనూ తమకు ఇచ్చిన విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వేజోన్ ఈ సారైనా ఇస్తారా ? అనే ఆశలు నెలకొన్నాయి.
రైల్వే బడ్జెట్ అంటే ఒకప్పుడు అందరిలోనూ ఆసక్తి ఉండేది. ఆర్థిక బడ్జెట్ కంటే ముందుగానే పార్లమెంట్లో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో తమ రాష్ట్రానికి రైళ్లు, రైల్వే ప్రాజెక్టులు వచ్చాయా ? అని ప్రజలు, పాలకులు ఆశగా ఎదురుచూసేవారు. కానీ... ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్ర బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపేయడంతో... ఇప్పుడు రైల్వే బడ్జెట్‌కు అంతగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. అయితే తమ రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్టుల విషయంలో చాలామందిలో ఇప్పటికీ ఆసక్తి ఉంది. ఏపీ ప్రజల్లోనూ తమకు ఇచ్చిన విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వేజోన్ ఈ సారైనా ఇస్తారా ? అనే ఆశలు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్ అంశాన్ని కేంద్రం దాదాపుగా పక్కన పెట్టేసింది. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని పరిశీలిస్తున్నామని ఒకసారి... జోన్ సాధ్యంకాకపోవచ్చని మరోసారి కేంద్ర పెద్దలు చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజలకు ఆగ్రహం కలిగించాయి. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత విశాఖ రైల్వే జోన్ అంశం పూర్తిగా మరుగున పడిపోయిందనే చెప్పాలి. తాజాగా పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో... అందులో విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన ఉంటుందా ? అని విశాఖ వాసులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికప్పుడు రైల్వే జోన్ ప్రకటించకపోయినా... ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఏదైనా ప్రకటిస్తారా ? అని ఏపీ వాసులు ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ తలుచుకుంటే విశాఖ రైల్వే జోన్ పెద్ద విషయం కాకపోవడంతో... ఆయన ఈ సారైనా కరుణిస్తారా ? అనే ఆసక్తి నెలకొంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.