Union Budget 2019 Live: ఎకరానికి రూ.6వేలు: ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు మోదీ చేయూత

Live Union Budget 2019 Updates | కేంద్ర బడ్జెట్‌లో రైతులకు కొత్త పథకాన్ని ప్రకటించారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఎకరానికి రూ.6000 చొప్పున ఇస్తారు.

news18-telugu
Updated: February 1, 2019, 12:32 PM IST
Union Budget 2019 Live: ఎకరానికి రూ.6వేలు: ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు మోదీ చేయూత
పీయూష్ గోయల్
  • Share this:
ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైతులకు భారీ ఊరట కల్పించారు. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రైతులకు నగదు బదిలీ చేస్తారు. ఏడాదికి ఒక్క ఎకరానికి రూ.6000 చొప్పున నగదు బదిలీ చేస్తారు. రెండు హెక్టార్ల లోపు (ఐదు ఎకరాలు) ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం వల్ల దేశంలోని 12 కోట్ల మందికి లబ్ది జరుగుతుందని పీయూష్ గోయల్ ప్రకటించారు. 2018 డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి బడ్జెట్‌లో రూ.75,000 కోట్లను కేటాయించారు. ఎకరానికి రూ.6000 చొప్పున ఇచ్చే నిధులు మూడు విడుతల్లో అందిస్తారు. దేశంలో పెద్ద పెద్ద ఆసాముల కంటే చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. దీంతో రైతులకు లబ్ధి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేదని, మద్దతు ధర పెంచాలంటూ గత కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలోకి వారికి ఎంట్రీ ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కనీసం పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదన్న కోపంతో కొందరు రైతులు తాము అమ్మిన వస్తువులకు వచ్చిన డబ్బును నిరసిస్తూ మోదీకి  మనియార్డర్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకంతో రైతులకు పెట్టుబడి సాయం లభిస్తుంది. దీని వల్ల కొంత ఊరట లభిస్తుందని ఆశిస్తున్నారు.
First published: February 1, 2019, 11:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading