ఎన్నికల ముందు కేంద్రం వరాలు ప్రకటిస్తుందని భావించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఇన్ఛార్జ్ ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2022 వరకు నవభారతాన్ని నిర్మించే దిశగా తమ ప్రభుత్వం సాగుతోందని గోయల్ అన్నారు. ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అందరికీ ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలు అందించడమే లక్ష్యమని.. అందులో చాలావరకు విజయం సాధించామని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ద్రవ్యలోటును 6 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గించగలిగామని అన్నారు. గత ఐదేళ్లలో వేల కోట్ల రూపాయల ఎఫ్‌డీఐలను తీసుకురాగలిగామని తెలిపిన పీయూష్ గోయల్... పబ్లిక్ సెక్టార్లో బ్యాంకుల బలోపేతానికి, పారదర్శక బ్యాంకింగ్‌కు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూ. 3 లక్షల కోట్ల రుణ బకాయిలను ఇప్పటికే వసూలు చేశామని అన్నారు.
మరోవైపు ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాఫెల్ డీల్ విషయంలో బీజేపీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Parliament, Piyush Goyal, Pm modi, Union Budget 2019