Union Budget 2019 : నేటి బడ్జెట్ ఎలా ఉండాలి... ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే...

Union Budget 2019 : కేంద్రంలో బీజేపీ మోదీ సారధ్యంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. మరి నిర్మలా సీతారామన్ వాటిని అందుకుంటారా....

Krishna Kumar N | news18-telugu
Updated: July 5, 2019, 9:10 AM IST
Union Budget 2019 : నేటి బడ్జెట్ ఎలా ఉండాలి... ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే...
నిర్మలా సీతారామన్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: July 5, 2019, 9:10 AM IST
General Budget 2019 : ఇదివరకు రక్షణ శాఖను సమర్థంగా నిర్వహించి... ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారన్నది అందరూ ఎదురుచూస్తున్న పరిణామం. సమస్యేంటంటే... ప్రస్తుతం దేశ పరిస్థితి బాగోలేదు. వృద్ధి రేటు 5.8 శాతానికి పడిపోయింది. దాన్ని పరుగులు పెట్టించాలంటే రాయితీలు, బెనెఫిట్స్ వంటివి బడ్జెట్‌లో ప్రకటించాలి. దేశంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కష్టమే. యూపీఏ-2లో వ్యవసాయరంగం అభివృద్ధి 4.7గా ఉంది. మోదీ వచ్చాక 2014-2019 వరకూ... వ్యవసాయ రంగ వృద్ధి 2.8 శాతమే. వర్షాలు సరిగా పడకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇక మిగతా కష్టాలు కూడా తోడై... రైతులు నష్టపోయారు.

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కానీ రైతులకు ఎప్పుడూ కన్నీరే మిగులుతోంది. నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, దళారుల దోపిడీలు సాగుతూనే ఉన్నాయి. పండించే పంటకు మద్దతు ధర లభించట్లేదు. ఈ సంవత్సరమూ అంతే. సరైన వర్షాలు పడక... రైతులు దిక్కుతోడని స్థితిలో ఉన్నారు. ప్రధాని కృషి యోజన, పంటల బీమా పథకం, ఆరోగ్య కార్డులు, ఈ-మండీ వంటివి రైతులకు పూర్తిస్థాయి ప్రయోజనం కలిగించలేదు.

వర్షాలు కురవకపోవడం మరో పెను ప్రమాదాన్ని సూచిస్తోంది. దేశంలో ఇప్పటికే 60 కోట్ల మందికి తాగు నీరు లేదు. దాదాపు 91 శాతం రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. దేశంలో దాదాపు 450 చిన్నా, పెద్దా నదులున్నాయి. వాటిలో నీరు మాత్రం తాగడానికి ఉపయోగపడట్లేదు. నీటి కాలుష్యం పెరిగిపోయింది. పల్లెల్లో 84 శాతం మంది తాగేందుకు సరైన మంచి నీరు లేదు. దేశంలో మనం తాగే నీటిలో 70 శాతం వరకూ కలుషితమైనదే అంటే నమ్మగలరా. ఓవైపు చెన్నైలో చుక్క నీరు లేక నానా తిప్పలు పడుతుంటే... అటు ముంబై పూర్తిగా మునిగిపోయింది. కాలుష్య నియంత్రణ, జల సంరక్షణ కోసం బడ్జెట్‌లో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

బ్యాకింగ్ రంగంలో కీలక మార్పులు తేవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రైవేట్ బ్యాంకులు చక్కగా పనిచేస్తుంటే... ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో మూలుగుతున్నాయి. ఇందుకు కారణం... ప్రభుత్వాలు ఇచ్చే హామీలకు రుణాలు ఇచ్చి, వాటిని తిరిగి వసూలు చేసుకోలేకపోవడమే. గత రెండేళ్లలోనే బ్యాంకులు రూ.75వేల కోట్లు నష్టపోయాయి. బ్యాంకింగ్ రంగంపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతోంది. ఈ పరిస్థితి మారకపోతే, ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంటుంది.ఇక రోడ్లు, ఇళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 2018లో రోడ్ల కోసం రూ.79వేలు కేటాయించారు. 2019 ఫిబ్రవరి నాటి మధ్యంతర బడ్జెట్‌లో 83వేలకు పెంచారు. ప్రస్తుతం దేశంలో రోజుకు 32 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నారు. రోజుకు 40 కిలోమీటర్ల రోడ్డు వేస్తామని కేంద్రం అంటోంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

దేశంలో పారిశ్రామిక రంగం ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు. భారీ పరిశ్రమల ఏర్పాటు ఆలోచనలకే పరిమితం అవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తే, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టగలరు. అంతే కాదు ఉత్పత్తి పెరిగి... విదేశీ ఎగుమతులు పెరిగి... కరెంటు ఖాతా లోటును తగ్గించేందుకు వీలవుతుంది. అదే సమయంలో రూపాయి మారకపు విలువ పెరిగి... ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఈ విషయాలన్నీ నిర్మలా సీతారామన్ పరిశీలనలో ఉన్నవే. మరి ఆమె ఎలాంటి బడ్జెట్ రూపొందించారో శుక్రవారం చూద్దాం.
First published: July 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...