విద్యాప్రమాణాలు పాటించడంలో భారత్ మెరుగ్గా ఉందని యూనేటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ (United Nations Children's Fund) పేర్కొంది. అంతే కాకుండా ఇండియాకు సంబంధించి మరో సర్వేను యూనిసెఫ్ (UNICEF) విడుదల చేసింది. పాఠశాలలు మూసివేయడం వల్ పిల్లల చదువుపై పడిన ప్రభావం ఎలా ఉందో సర్వే (Survey) వివరాలు వెల్లడించింది. కరోనా కారణంగా భారత్‌లో 5-13 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల తల్లిదండ్రులలో 76 శాతం మంది మరియు 14-18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో 80 శాతం మంది స్కూళ్లు మూసి ఉండడం వల్ల చదువపై ప్రభావం పడిందని పేర్కొన్నట్టు వెల్లడించింది. అంతే కాకుండా 10శాతం మంది విద్యార్థులు అసలు స్మార్ట్‌ఫోన్ వాడలేదని సర్వేలో వెల్లడైంది.
కోవిడ్ సమయంలో ఇబ్బందితో సర్వే..
కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థులు నేర్చుకునే స్థితిపై 2020లో ఆరు రాష్ట్రాల్లో - అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో ఈ సర్వే నిర్వహించబడింది. రిమోట్ లెర్నింగ్ అవకాశాలను ఉపయోగించని 45 శాతం మంది పిల్లలకు తాము నేర్చుకోగల వనరుల గురించి పూర్తిగా తెలియదని సర్వే వెల్లడించింది.
ప్రపంచ బాలల దినోత్సవం రోజున యునిసెఫ్ ఇండియాతో కలిసి పార్లమెంటేరియన్స్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ (PGC) 'చిల్డ్రన్స్ పార్లమెంట్'ను నిర్వహించింది. ఇందులో విద్యార్థులు తిరిగి మంచి వాతావరణంలో చదువకోవడానికి వీలు కల్పించాలని సూచించింది. పాఠశాలల పునః ప్రారంభం.. ఆన్లైన్ చదువుకు కూడా అవకాశాలు కల్పించడ.. పిల్లలకు టీకా వేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని యూనిసెఫ్ సూచించింది.
ఇంటర్నెట్, డిజిటల్ పరికరాలు సరిగా లేకపోవడం కారణంగా విద్యార్థులు ఆన్లైన్ తరగతులను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయారని యూనిసెఫ్ పేర్కొంది.
JP Morgan Jobs: జేపీ మోర్గాన్ హైదరాబాద్ బ్రాంచ్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్
అంతే కాకుండా కరోనా కారణంగా తక్కువ-ఆదాయ నేపథ్యం ఉన్నవారికి పాఠశాల ఫీజులను మినహాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలలు సరిగా తెరవలేని పక్షంలో టెలివిజన్ క్లాస్‌లకు అవకాశాన్ని కల్పించాలని సూచించారు.పిల్లలపై ఒత్తిడి తగ్గించుకోవడానికి సెలబస్‌ను కుదించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది.
పాఠశాలలు తెరిచిన తరువాత సానిటైజేషన్, మాస్కులు, థర్మల్ స్క్రినింగ్, టీకాలు వంటి అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని యూనిసెఫ్ పేర్కొంది. పిల్లలు త్వరగా ఆడుకోవడానికి సౌకరర్యవంతమైన వెసులుబాటును కల్పించాలని సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona effect, India, Students, United Nations