Home /News /national /

UNEMPLOYMENT IS INCREASING EVERY YEAR IN THE COUNTRY WHAT PERCENTAGE HAS INCREASED SURPRISING TRUTHS IN THE SURVEY UMG GH

Employment: దేశంలో ఏటేటా పెరుగుతున్న నిరుద్యోగం.. సర్వేలో విస్తుపోయే నిజాలు !

దేశంలో ఏటేటా పెరుగుతున్న నిరుద్యోగం.. ఎంత శాతం పెరిగిందంటే.. సర్వేలో విస్తుపోయే నిజాలు !

దేశంలో ఏటేటా పెరుగుతున్న నిరుద్యోగం.. ఎంత శాతం పెరిగిందంటే.. సర్వేలో విస్తుపోయే నిజాలు !

దేశంలో ఉద్యోగ కల్పన నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఏటేటా నిరుద్యోగ శాతం పెరిగిపోతుంది. ఒక పక్క నిరుద్యోగం, మరోపక్క ద్రవ్యోల్బణంతో దేశ ఆర్థివ వ్యవస్థ కుంటుపడుతోంది. ప్రైవేట్ రంగంలో కూడా పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఇక ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన మరీ దారుణంగా ఉంది.

ఇంకా చదవండి ...
దేశంలో ఉద్యోగ కల్పన నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఏటేటా నిరుద్యోగ శాతం పెరిగిపోతుంది. ఒక పక్క నిరుద్యోగం(Unemployment), మరోపక్క ద్రవ్యోల్బణం(Inflation)తో దేశ ఆర్థివ వ్యవస్థ కుంటుపడుతోంది. ప్రైవేట్ రంగంలో కూడా పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఇక ప్రభుత్వ రంగంలో ఉద్యోగ(Jobs) కల్పన మరీ దారుణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా విశ్లేషిస్తే.. 2014 నుంచి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 22,05,99,238. అయితే వీరిలో కేవలం 7,22,311 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2014-15 నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే 2019-20 మధ్య కాలంలో కొంత మార్పు వచ్చింది. ఈ వ్యవధిలో 1,47,096 మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

నిరుద్యోగం విషయాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు అధికార బీజేపీ(BJP) ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. దేశాన్ని అప్పులమయంగా మార్చేసిందని కేంద్రంపై మండిపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యూ కట్టిన 22 కోట్ల మంది యువతలో, కేవలం 7.22 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయన్నారు. ఇది ప్రభుత్వ ఘనత అని ఎద్దేవా చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి వెయ్యి మందిలో కేవలం ముగ్గురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని రాహుల్ గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు. “నిరుద్యోగంపై ప్రశ్నిస్తే, రాజా(మోదీ)కి కోపం వస్తుంది. నిజం ఏమిటంటే వారు ఉపాధిని చూపించగలరు.’’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సీఎంఐఈ డేటాను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

ఇదీ చదవండి: Pink Diamond: 300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మతిపోతుంది.. ఎక్కడ దొరికిందంటే !


సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం.. జూన్ 2022లో భారతదేశ ఉపాధి స్థాయి 390 మిలియన్లకు పడిపోయింది. మేలో 7.1.% ఉన్న నిరుద్యోగిత రేటు జూన్‌లో 7.8%కి పెరిగింది. సీఎంఐఈ డేటాను విశ్లేషిస్తే.. 2017-18 మధ్యకాలం నుంచి 20- 24 సంవత్సరాల వయసు ఉన్న నిరుద్యోగ యువత సంఖ్య క్రమంగా పెరుగుతోందని.. పర్సెంటేజ్‌లో చూస్తే 21% నుంచి 42%కి పెరిగింది.



ఉపాధి కల్పన‌పై లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇలా ఉంది. ‘‘ఉపాధి కల్పనతో పాటు ఉపాధిని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యత. తదనుగుణంగా దేశంలో ఉపాధి కల్పన కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్ వంటి అనేక ఇతర ప్రభుత్వపరంగా కార్యక్రమాలు చేపడుతన్నాం. తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా ముందుకు సాగుతున్నాం.’’ అని కేంద్రం వివరించింది.
Published by:Mahesh
First published:

Tags: Central Govt Jobs, EMPLOYMENT, Rahul Gandhi, Un employement

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు