నవభారత (New India) నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పోషిస్తున్న పాత్ర అంతా ఇంతా కాదు. మన దేశం ఎంతో వైవిధ్యమైన సంస్కృతులకు, భాషలకు, ప్రకృతి అందాలకు నెలవు. మనదేశ సంస్కృతి ఎంతో శక్తివంతమైనది. భారతీయుల విస్తారమైన నాగరికత (Civilisation) ప్రపంచానికి అపారమైన జ్ఞానాన్ని ఎప్పటినుంచో అందిస్తోంది. భారత్ పరాయి పాలనలో ఉన్నప్పుడు కూడా తన సంస్కృతిని మరింత పెంచుకుంది. ప్రతి తరానికి గొప్ప ఆధ్యాత్మిక బోధనలు, గురువులు, యోగులు, ఋషులను అందించింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత నేడు మన దేశం ప్రపంచంలోని ఇతర దేశాలు లేదా సంస్కృతులను అలవాటు చేసుకోకుండా విశాలమైన నాగరికతను మళ్లీ ఉనికిలోకి తీసుకొస్తోంది.
* అద్భుత నిర్మాణాల్లో నాగరికత
స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తరువాత, నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఒక కొత్త భారతదేశం ఆవిర్భవించబోతోంది. ఇది దేశం, సంస్కృతి, శాశ్వతమైన భారతదేశం నాగరికతకు మిక్కిలి ప్రాధాన్యత ఇవ్వబోతోంది. అదే సమయంలో రాజకీయ, ఆర్థిక స్థాయిలలో ఆధునిక జాతీయ రాజ్యంగా అవతరించబోతోంది. సాధారణంగా ఒక నాగరికత గొప్పతనం దాని స్మారక చిహ్నాలు ద్వారానే తెలుస్తుంది.
భారతదేశ ధార్మిక నాగరికత గొప్పతనాన్ని దేవాలయాలు, అనేక శతాబ్దాలు పాటు నిర్మించిన... గౌరవించిన పవిత్ర స్థలాలు తెలియజేస్తాయి. నిజానికి ఇలాంటి నిర్మాణాలెన్నో దేశవ్యాప్తంగా మనకి దర్శనమిస్తాయి కానీ ఇప్పుడు వాటిలో చాలా ముఖ్యమైనవి శిథిలావస్థలో ఉన్నాయి. వీటిని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అవి ఆ స్థితికి చేరుకున్నాయి.
ఈ క్రమంలోనే అయోధ్య, కేదార్‌నాథ్, కాశీ విశ్వనాథ్ వంటి ముఖ్యమైన వారసత్వ ప్రదేశాలను... అలాగే భారతదేశ శాశ్వత నాగరికతను ప్రతిబింబించే కొత్త స్మారక చిహ్నాలను మోదీ గౌరవించారు. వీటికి పూర్వవైభవం తీసుకురావడంలో తనవంతు కృషి చేశారు. స్వాతంత్ర్యం తర్వాత దాని సొంత రాజకీయ స్మారక చిహ్నాలను కూడా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి దేశానికి ఏర్పడింది.
దాంతో మోదీ దేశ నాగరికత వారసత్వాన్ని కాపాడుతూ ఢిల్లీని కర్తవ్య మార్గంలో మార్చారు. సెంట్రల్ విస్టా కాంప్లెక్స్‌ను జాతీయ శక్తి కేంద్రంగా మార్చారు. ఈ క్రమంలో బ్రిటిష్ వారు నిర్మించిన పాత వలస స్మారక కట్టడాలను తొలగించారు. వీటితో భారతదేశంలోని భవిష్యత్ తరాలు గర్వపడేలా చేశారు.
* ఆలయాల సందర్శనలో మోదీ
శివుడు, కృష్ణుడు, రాముడు, సీత, సరస్వతి, దుర్గ, కాళీ, గణేశుడు, హనుమంతుడు వంటి భారత దేవతలు ఈ కొత్త భారతదేశంలో మరోసారి అత్యధిక ప్రాధాన్యత పొందారు. మోదీ ఆయా దేవతల ఆలయాలను సందర్శించడం, ఆరాధించడం వల్లే మళ్లీ హిందూ దేవతలకు ఎక్కడలేని ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఆయుర్వేద దినోత్సవం వంటి కొత్త కార్యక్రమాలతో మోదీ జాతీయ, ప్రాంతీయ స్థాయిలలో భారతదేశ గొప్పతనాన్ని ఏటా చాటుతున్నారు.
ఇది కూడా చదవండి : భారతీయ సంస్కృతికి ఉత్తమ రాయబారి మోదీ.. అందుకు ఈ సాక్ష్యాలే నిదర్శనం..
ఆ మహనీయులను గౌరవించిన మోదీ
నవభారత నిర్మాణానికి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, శ్రీ అరబిందో, వీర్ సావర్కర్లు మార్గదర్శకులుగా నిలిచారు. మోదీ వారిని గౌరవించి దేశ ప్రజలకు వారి గొప్పతనాన్ని తెలియజేశారు. గుజరాత్‌లోని సముద్రం ఒడ్డున సర్దార్ పటేల్ విగ్రహాన్ని, ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని స్థాపించారు. రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ వంటి రాజులు, యోధులను మోదీ గౌరవించారు. భారతదేశ గొప్ప గురువులైన ఆదిశంకర, రామానుజ, బుద్ధ, మహావీరు, గురునానక్ వంటి ఎందరినో ప్రధాని ఆదర్శంగా భావిస్తున్నారు.
* ప్రపంచ శక్తిగా భారత్
మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాలలో భారత నాగరికతను ప్రతిబింబించే ప్రతిదాన్ని పునరుద్ధరించడంలో ముందడుగు వేశారు. పవిత్రమైన గంగా నదిని పునరుద్ధరించడంలో, భారతదేశంలోని వృక్షజాలం, జంతుజాలాన్ని సంరక్షించడంలో, దేశంలోని పర్యాటక ప్రదేశాలను మెరుగుపరచడంలో, అలాగే వ్యవసాయాన్ని రక్షించడంలో, అభివృద్ధి చేయడంలో మోదీ చేసిన కృషి ప్రశంసనీయం. ఒక్కమాటలో చెప్పాలంటే ఆధునిక భారతదేశాన్ని ప్రాచీన భారతదేశంతో మోదీ పునరుద్ధరించారు. దౌత్య, ఆర్థిక, సైనిక, సాంస్కృతిక స్థాయిలలో భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా తిరిగి తీసుకువచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.