నీట్‌లో ఫెయిల్..దళిత విద్యార్థిని సూసైడ్..!

17 ఏళ్ల ప్రతిభ మృతి తమిళనాడు రాష్ట్రంలో వివాదానికి దారితీసింది. విల్లుపురం కలెక్టరేట్‌ ఎదుట స్థానికులు ఆందోళన నిర్వహించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు నీట్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 2:34 PM IST
నీట్‌లో ఫెయిల్..దళిత విద్యార్థిని సూసైడ్..!
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: June 6, 2018, 2:34 PM IST
  • Share this:
చెన్నై: నీట్‌లోఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో 17 ఏళ్ల దళిత మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఫలితాలు వెలువడ్డాక రాత్రి విషం తాగి చనిపోయింది.

విల్లుపురం జిల్లాకు చెందిన  ప్రతిభా షణ్ముగం గత ఏడాది నీట్‌లో ఉత్తీర్ణత సాధించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. అయితే ప్రైవేట్ కాలేజీ కావడంతో విద్యా ఖర్చులు ఆ పేదింటికి భారమయ్యాయి. దీంతో ఈసారి ఎలాగైన మెరుగైన ర్యాంకు సాధించి ప్రభుత్వ కాలేజీలో సీటు సాధించాలని ప్రతిభ భావించింది. కానీ తన కల నెరవేరకపోవడంతో బలవన్మరణానికి పాల్పడింది.

“ సీబీఎస్ఈ సిలబస్ చదవలేని ప్రాంతీయ విద్యార్థులకు నీట్ కోచింగ్ కష్టంగా మారింది. సరైన కోచింగ్ లేనిదో నీట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆమె మృతికి బాధ్యత వహించాలి. అని ప్రతిభ బంధువొకరు మీడియాతో అన్నారు.

17 ఏళ్ల ప్రతిభ మృతి రాష్ట్రంలో వివాదానికి దారితీసింది. విల్లుపురం కలెక్టరేట్‌ ఎదుట స్థానికులు ఆందోళన నిర్వహించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు నీట్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. నీట్‌ విషయంలో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, విపక్ష నేత స్టాలిన్.

“ ఇది చాలా బాధాకరం. ప్రతిభ కుటుంబానికి నా సానూభూతి ప్రకటిస్తున్నా. నీట్ కారణంగా చోటు చేసుకుంటున్న ఈ తరహా మరణాలను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.”  అని సినీ నటుడు రజినీకాంత్ అన్నారు.

గత ఏడాది సెప్టెంబరులో తమిళనాడులో అనిత అనే 17 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. నీట్‌లో పాసవలేదనే మనస్థాపంతో చనిపోయింది. ఎంబీబీఎస్ ప్రవేశాలపై స్టే విధించాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అందుకు సుప్రీంకోర్టు నిరాకరరించడంతో ...అనిత ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కాగా, మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.
Published by: Shiva Kumar Addula
First published: June 5, 2018, 3:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading