హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

UK Virus in India: భారత్‌లో ప్రవేశించిన కరోనా కొత్త వైరస్... ఇక మనం జాగ్రత్త పడాల్సిందే...

UK Virus in India: భారత్‌లో ప్రవేశించిన కరోనా కొత్త వైరస్... ఇక మనం జాగ్రత్త పడాల్సిందే...

ఈ ఫంగస్ మనిషి శరరీంలోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదమని.. దీనికి ఎలాంటి విరుగుడు ఉండకపోవచ్చని అన్నారు.

ఈ ఫంగస్ మనిషి శరరీంలోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదమని.. దీనికి ఎలాంటి విరుగుడు ఉండకపోవచ్చని అన్నారు.

Coronavirus 2.0: మనందరం ఇన్నాళ్లూ పాత కరోనా పోతోందనుకున్నాం. కొత్త కరోనా వచ్చేసింది. ఇకపై మళ్లీ మనం మాస్కులు వాడాలి, శానిటైజర్లను వెంట తీసుకెళ్లాలి...

  New Virus variant in India: కొత్త సంవత్సరం ఇంకా మొదలవ్వలేదు... అప్పుడే కొంపలు మునిగినట్లు కొత్త కరోనా వైరస్ ఇండియాలోకి వచ్చేసింది దాన్ని రానివ్వకుండా చెయ్యాలని కేంద్రం ఎంతలా ప్రయత్నించినా కుదర్లేదు. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి చెక్ చెయ్యగా... 6గురిలో కొత్త కరోనా ఉన్నట్లు తేలింది. వారిలో 3కి NIMHANS, ఇద్దరికి బెంగళూరులోని CCMBలో జరిపిన పరీక్షల్లో, ఒకరికి హైదరాబాద్‌లో, ఇంకొకరికి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ (NIV)లో జరిపిన పరీక్షల్లో కొత్త కరోనా ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఈ ప్రయాణికులందర్నీ... ఎవరికి వారిని విడివిడిగా రూముల్లో ఐసోలేట్ చేశారు. వారికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి. వారితో క్లోజ్ కాంటాక్టులు ఎవరు అన్నది ఇప్పుడు చెక్ చేస్తున్నారు. కంప్లీట్ కాంట్రాక్ట్ ట్రేసింగ్ జరుగుతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందర్నీ టెస్టులు చేస్తున్నారు. అందరికీ జన్యు పరమైన టెస్టులు చేయడం ద్వారా వారిలో కొత్త కరోనా వైరస్ ఉందా అన్నది తేల్చనున్నారు.

  ఇన్నాళ్లూ కొత్త కరోనా వచ్చిందా లేదా అని అనుకుంటూ ఉన్న మనకు... ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. సో, మనం ఇక జాగ్రత్త పడాలి. బయటకు వెళ్లేటప్పుడు మనం తప్పనిసరిగా మందంగా ఉండే మాస్క్ ధరించాలి. ఆ రూ.10 మాస్కుల బదులు... కాస్త రేటెక్కువ అయినా మంచి మాస్కులు వాడటం మేలు. ఎందుకంటే కొత్త కరోనా 70 శాతం వేగంగా వ్యాపిస్తోంది. కాబట్టి... దాని దగ్గర అంతంత మాత్రం మాస్కుల ఆటలు సాగవు. మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి. అలాగే తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్ వాడాలి. అలాగే సేఫ్ డిస్టాన్స్ పాటించాలి.

  కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన

  ప్రపంచవ్యాప్తంగా నిన్న కొత్తగా 4,56,079 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 8,16,30,490కి చేరింది. నిన్న కొత్తగా 8794 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 17,80,654కి చేరింది. రికవరీ కేసులు 5,77,16,110 ఉండటంతో... యాక్టివ్ కేసులు 2,21,33,726గా ఉన్నాయి. వీటిలో 1,05,550 మందికి కరోనా తీవ్రంగా ఉంది. మొత్తం యాక్టివ్ కేసుల్లో వీరు 0.5 శాతంగా ఉన్నారు. అంటే 1000 మందికి కరోనా వస్తే, వారిలో 5గురికి మాత్రమే అది తీవ్రంగా ఉంటోందని అర్థం.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Coronavirus, Covid-19, UK Virus

  ఉత్తమ కథలు