HOME »NEWS »NATIONAL »uk virus as a precautionary measure tamilnadu government banned the new years eve celebrations nk

UK Virus: కొత్త కరోనాపై తమిళనాడు ప్రభుత్వం అలర్ట్.. సంచలన నిర్ణయంతో ప్రజలకు నిరాశ

UK Virus: కొత్త కరోనాపై తమిళనాడు ప్రభుత్వం అలర్ట్.. సంచలన నిర్ణయంతో ప్రజలకు నిరాశ
కొత్త కరోనాపై తమిళనాడు ప్రభుత్వం అలర్ట్.. సంచలన నిర్ణయంతో ప్రజలకు నిరాశ (File image coutersy - twitter - Madurantakam TE Raja Simhan)

Britain CoronaVirus: ఇండియా మళ్లీ లాక్‌డౌన్ల వైపు వెళ్లబోతోందా? అన్ని రాష్ట్రాలూ ఈ దిశగా ఆలోచిస్తున్నాయా? తమిళనాడు ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయమేంటి?

  • Share this:
    Britain CoronaVirus: డిసెంబర్ 31న వేడుకలు జరుపుకొని... కరోనాను తెచ్చిన 2020కి గుడ్‌బై చెప్పాలని తమిళనాడు ప్రజలు రెడీ అవుతుంటే... వారి ఆశలపై నీళ్లు చల్లింది అక్కడి ప్రభుత్వం. డిసెంబర్ 31, జనవరి 1న బీచ్‌లు, హోటళ్లు, క్లబ్బులు, రిసార్టుల్లో న్యూ ఇయర్ వేడుకలు జరపడానికి వీల్లేదు అంటూ నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఆ రెండు తేదీల్లో ఎవరూ సముద్ర తీరంలోకి వెళ్లడానికి వీల్లేదనితె లిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా... కొత్త కరోనా వైరస్‌ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అంటున్నారు. నిషేధాజ్ఞల కారణంగా... డిసెంబర్ 31న ప్రజలు రాత్రివేళ రోడ్లపై, ఇతరత్రా ప్రదేశాల్లో తిరిగేందుకు వీలు లేకుండా పోయింది. కరోనా వల్ల కొత్త సంవత్సరం కూడా నిరాశతోనే మొదలయ్యే పరిస్థితి వచ్చింది.

    ప్రస్తుతం తమిళనాడులో యాక్టివ్ కేసులు 9495 ఉన్నాయి. ఇండియాలో కరోనా బాగా సోకిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. పొరపాటున ఇండియాలో బ్రిటన్‌లో వచ్చిన కొత్త వైరస్ వస్తే... తమిళనాడులో కూడా అది బాగా వ్యాపించే ప్రమాదం ఉందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ముందుగానే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. రాష్ట్రంలో 8 నెలల పాటూ లాక్‌డౌన్ అమల్లో ఉండగా... ఈమధ్యే నిబంధనలను క్రమంగా తొలగించారు. కానీ ఇప్పుడు మళ్లీ రూల్స్ అమలు చేస్తుండటంతో... ప్రజలు ఇబ్బందిగా ఫీలవుతున్నారు.



    "ప్రభుత్వంతో ప్రజలు సహకరించాలి. మనందరం కలిసి ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలి. సాధారణ రోజుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, రిసార్టులు... కరోనా జాగ్రత్తలతో సేవలు అందిస్తాయి. ఆ రెండ్రోజులు మాత్రం కరోనా కొత్త రూల్స్ అమలవుతాయి" అని ప్రభుత్వం తెలిపింది.

    ఇది కూడా చదవండి: UK Virus: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో RT-PCR టెస్టులు.. లండన్ నుంచి ఎంత మంది వచ్చారంటే

    కొత్త రకం కరోనా దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి వచ్చే నెల 5 వరకు రాష్ట్రంలోని పురపాలక సంఘాల ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. యూరప్, పశ్చిమాసియా దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు ఆసుపత్రులు, హోటళ్లలో 14 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది.
    Published by:Krishna Kumar N
    First published:December 22, 2020, 11:08 IST

    टॉप स्टोरीज