UK PM JOHNSON ARRIVES IN INDIA GIVEN GRAND WELCOME IN AHMEDABAD PVN
UK PM India Visit : స్వాగతం..సుస్వాగతం..తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన బోరిస్ జాన్సన్..నేరుగా గుజరాత్ కే
అహ్మదాబాద్ చేరుకున్న బ్రిటన్ ప్రధానికి ఘన స్వాగతం
Boris Jhonson India Visit : రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్..గుజరాత్ లో అడుగుపెట్టారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్న బోరిస్ జాన్సన్ కి..గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు,మంత్రులు సాదర స్వాగతం పలికారు.
Boris Jhonson India Visit : రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్..గుజరాత్ లో అడుగుపెట్టారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్న బోరిస్ జాన్సన్ కి..గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు,మంత్రులు సాదర స్వాగతం పలికారు. బ్రిటన్ ప్రధాన మంత్రి తన కాన్వాయ్ లో హోటల్ కు వెళుతుండగా... విమానాశ్రయం వద్ద మరియు రహదారి వెంబడి సంప్రదాయ గుజరాతీ నృత్యాలు మరియు సంగీతాన్ని ప్రదర్శిస్తూ బృందాలు స్వాగతం పలికాయి. గుజరాత్ ఎయిర్ పోర్ట్ బయట రోడ్ షో ప్రారంభమై దఫ్నాలా మరియు రివర్ ఫ్రంట్ మీదుగా ఆశ్రమ రహదారి గుండా సాగింది.
ఎయిర్పోర్ట్ సర్కిల్ నుండి ఆశ్రమం రోడ్ లోని ఫైవ్ స్టార్ హోటల్ వరకు నాలుగు కి.మీల విస్తీర్ణంలో క్రమ వ్యవధిలో 40 ప్లాట్ ఫారమ్ లు ఏర్పాటు చేయబడ్డాయి, అక్కడ మళ్లీ బృందాలు జాన్సన్ కు స్వాగతం పలికేందుకు భారతీయ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించాయి. ఇవాళ తన గుజరాత్ పర్యటనలో బోరిస్ జాన్సన్..గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ను నిర్వహించనున్నట్లు సమాచారం. భారత్- బ్రిటన్ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేయనున్నారు. అనంతరం ఢిల్లీకి పయనమవుతారు. గుజరాత్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి బయలుదేరే ముందు గాంధీనగర్‌లోని స్వామినారాయణ్ శాఖకు చెందిన ప్రసిద్ధ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. బ్రిటన్‌లో ఉన్న భారతీయుల్లో అత్యధికులు గుజరాత్‌కు చెందినవారే కావడంతో ఆయన నేరుగా అహ్మద్‌బాద్ వచ్చారు.
శుక్రవారం ప్రధాని మోదీతో, వాణిజ్య ప్రతినిధులతో..బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భేటీ అవుతారు. తొలుత రాష్ట్రపతి భవన్లో జరిగే విందుకు హజరుకానున్న జాన్సన్.. అనంతరం మహాత్మ గాంధీ సమాధికి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. సాయంత్రం భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జైశంకర్‌తో భేటీ కానున్నారు. కాగా గతేడాది భారత్-బ్రిటన్ వ్యూహాత్మక బంధంలో భాగంగా ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఒప్పందం చేసుకున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా బోరిస్ జాన్సన్ గతేడాది రెండుసార్లు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. గత జనవరిలో గణతంత్ర దినోత్సవానికి భారత్ ఆహ్వానించగా.. యూకేలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. భారత్ లో కరోనా మళ్లీ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రద్దయిన విషయం తెలిసిందే.
కాగా, భారత్‌లో రెండు రోజుల పాటు కొనసాగే తన పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రజల అనుబంధాన్నీ ఇనుమడింపజేస్తుందన్నారు. తన విదేశీ పర్యటనను పురస్కరించుకొని బుధవారం బ్రిటన్ పార్లమెంటు దిగువసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. నా భారత్ పర్యటన రెండు దేశాల సంబంధాలను మరింత వేళ్లూనుకునేలా చేస్తుంది. ఢిల్లీలో ప్రధాని మోదీని, పారిశ్రామివేత్తలను కలుస్తాను అని జాన్సన్ తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.