Home /News /national /

UK PM BORIS JOHNSON VISITS SABARMATI ASHRAM IN AHMEDABAD SPINS CHARKHA PVN

UK PM India Tour : సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి..నూలు చరఖ తిప్పిన బ్రిటన్ ప్రధాని

సబర్మతి ఆశ్రమంలో నూలు చరఖ తిప్పిన బ్రిటన్ ప్రధాని

సబర్మతి ఆశ్రమంలో నూలు చరఖ తిప్పిన బ్రిటన్ ప్రధాని

British PM Visits Sabarmati Ashram :  రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్ గుజరాత్ కు చేరుకున్నారు. డన్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్న బోరిస్ జాన్సన్ కి..గుజరాత్‌ గవర్నర్ ఆచార్య దేవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, అధికారులు,మంత్రులు సాదర స్వాగతం పలికారు.

ఇంకా చదవండి ...
Boris Johnson Visits Sabarmati Ashram :  రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్ గుజరాత్ కు చేరుకున్నారు. డన్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్న బోరిస్ జాన్సన్ కి..గుజరాత్‌ గవర్నర్ ఆచార్య దేవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, అధికారులు,మంత్రులు సాదర స్వాగతం పలికారు. అయితే అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న బోరిస్ జాన్సన్...సబర్మ‌తి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. ఆ ఆశ్ర‌మంలో మ‌హాత్మా గాంధీ వాడిన నూలు చ‌ర‌ఖ‌ను బ్రిటన్ ప్రధాని తిప్పారు. నూలు చరఖ తిప్పడంలో బోరిస్ జాన్సన్ కు ఆశ్రమ నిర్వాహకులు సహాయం చేశారు. సబర్మతి ఆశ్రమ సందర్శన సంద‌ర్భంగా బోరిస్ జాన్సన్ విజిట‌ర్స్ బుక్‌ పై సంత‌కం చేశారు. ఓ అసాధార‌ణ వ్య‌క్తికి చెందిన ఆశ్ర‌మాన్ని విజిట్ చేయ‌డం గౌర‌వంగా భావిస్తాన‌ని, ప్ర‌పంచాన్ని ఉత్త‌మంగా తీర్చిదిద్దేందుకు స‌త్యం, అహింసా సిద్ధాంతాల‌ను గాంధీ ఎలా వాడ‌ర‌న్నది ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని ఆ బుక్‌ లో బోరిస్ రాశారు. గాంధీ రాసిన గైడ్ టు లండ‌న్ అన్న పుస్త‌కాన్ని బోరిస్‌ కు గిఫ్ట్‌ గా ఇచ్చారు.

కాగా,బోరిస్‌ జాన్సన్‌ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. బ్రిటన్‌లో ఉన్న భారతీయుల్లో అత్యధికులు గుజరాత్‌కు చెందినవారే కావడంతో ఆయన నేరుగా అహ్మద్‌బాద్‌ వచ్చారు. ఇవాళ తన గుజరాత్ పర్యటనలో బోరిస్ జాన్సన్..గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌ ను నిర్వహించనున్నట్లు సమాచారం. భారత్‌- బ్రిటన్‌ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేయనున్నారు. అనంతరం ఢిల్లీకి పయనమవుతారు. గుజరాత్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి బయలుదేరే ముందు గాంధీనగర్‌లోని స్వామినారాయణ్ శాఖకు చెందిన ప్రసిద్ధ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు.



శుక్రవారం ప్రధాని మోదీతో, వాణిజ్య ప్రతినిధులతో..బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భేటీ అవుతారు. తొలుత రాష్ట్రపతి భవన్​లో జరిగే విందుకు హజరుకానున్న జాన్సన్​.. అనంతరం మహాత్మ గాంధీ సమాధికి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. సాయంత్రం భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జైశంకర్​తో భేటీ కానున్నారు. కాగా గతేడాది భారత్​-బ్రిటన్​ వ్యూహాత్మక బంధంలో భాగంగా ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఒప్పందం చేసుకున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా బోరిస్‌ జాన్సన్‌ గతేడాది రెండుసార్లు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. గత జనవరిలో గణతంత్ర దినోత్సవానికి భారత్‌ ఆహ్వానించగా.. యూకేలో కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. భారత్‌ లో కరోనా మళ్లీ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రద్దయిన విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Britain prime minister, Gujarat

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు