Home /News /national /

UK PM BORIS JOHNSON TO VISIT INDIA IN BID TO BOOST DEFENCE TIES PVN

UK PM : ఎన్నాళ్లకెన్నాళ్లకు..భారత పర్యటనకు బోరిస్ జాన్సన్..నేరుగా గుజరాత్ కే

భారత పర్యటనకు బోరిస్ జాన్సన్(ప్రతీకాత్మక చిత్రం)

భారత పర్యటనకు బోరిస్ జాన్సన్(ప్రతీకాత్మక చిత్రం)

Boris Jhonson India Visit : ఎప్పటినుంచో వాయిదా పడుతున్న భారత్ పర్యటనకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ వారంలో రాబోతున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన భారత్‌ లో పర్యటించనున్నారు

Boris Jhonson India Visit : ఎప్పటినుంచో వాయిదా పడుతున్న భారత్ పర్యటనకు బ్రిటన్ ప్రధాన మంత్రి(UK Prime Minister) బోరిస్ జాన్సన్ ఈ వారంలో రాబోతున్నారు. రెండు దేశాల మధ్య రక్షణ బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన భారత్‌ లో పర్యటించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రెండుసార్లు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు బోరిస్ జాన్సన్(Boris Jhonson). గతేడాది జనవరిలో గణతంత్ర దినోత్సవానికి భారత్‌ ఆహ్వానించగా.. యూకేలో కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. భారత్‌ లో కరోనా మళ్లీ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రద్దయ్యింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ నెల 21న ఢిల్లీకి బోరిస్ రానున్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు భార‌త్‌ లో బ్రిటన్ ప్రధాని ప‌ర్య‌టిస్తార‌ని అధికారులు పేర్కొన్నారు తాజా పర్యటనలో భాగంగా బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్‌లో పర్యటించనున్నారు. బ్రిటన్, భారత్‌లలో కీలక రంగాల్లో పెట్టుబడులపై ఆయన ప్రకటన చేసే అవకాశముంది. సైన్స్, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో సహకారంపైనా మాట్లాడే అవకాశముంది. కాగా, ర‌ష్యా- ఉక్రెయిన్ యుద్ధం విష‌యంలో బ్రిట‌న్‌, భార‌త్‌.. రెండూ విభిన్న దృక్ప‌థాల‌ను క‌లిగి వున్నాయి. ఈ స‌మ‌యంలో బ్రిట‌న్ ప్ర‌ధాని భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు రావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఢిల్లీలో శుక్రవారం(ఏప్రిల్ 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో జాన్సన్ సమావేశం(  Modi-Boris Jhonson Meeting) కానున్నారు. రక్షణ, వాణిజ్య బంధాలు, ఆర్థిక వృద్ధి, ఇంధ‌న భ‌ద్ర‌త‌ సహా పలు రంగాల‌కు సంబంధించి, ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఇరు దేశాల మ‌ధ్య బంధాన్ని ప‌టిష్టం చేసుకోవ‌డం, వ్యూహాత్మ‌క ర‌క్ష‌ణ రంగ చ‌ర్య‌లు, దౌత్య‌, ఆర్థిక భాగ‌స్వామ్యం.. లాంటి విష‌యాల‌పై ఇరు దేశాల నేత‌లు లోతుగా చ‌ర్చిస్తార‌ని ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ కార్యాల‌య అధికారులు పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం, ఐక్యరాజ్య సమితిలో ఇండియా ఓటింగ్ విధానం, రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు వంటి అంశాలను బోరిస్ జాన్సన్ ప్రస్తావించే అవకాశముంది. ఉక్రెయిన్‌ పై రష్యా దాడి(Russia-Ukraine War) అనంతరం, ఆయుధ సంపత్తి కోసం రష్యా మీద ఆధారపడటాన్ని తగ్గించాలని భారత్‌ను ఒప్పించేందుకు బ్రిటన్‌ ప్రయత్నిస్తోంది. గత నెలలో బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ భారత్‌లో పర్యటించారు. రష్యాపై ఆంక్షలను విధించేందుకు భారత్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రతల్లో సహకారంపై కూడా చర్చలు జరిపారు.

ALSO READ Viral Video : గాల్లో బైడెన్ షేక్ హ్యాండ్..గందరగోళ చూపులు..వీడియో వైరల్

భారత్ పర్యటనకు ముందు మీడియాతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.."మన శాంతి, సుసంపన్నతలకు నియంతృత్వ దేశాల నుంచి ముప్పు ఎదురవుతుండటంతో మన రెండు ప్రజాస్వామ్య దేశాలు ఒకే మాటపై నిలవడం చాలా ముఖ్యం. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఒకటి. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా. చాలా రంగాల్లో భారత్‌ను ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా బ్రిటన్ గుర్తిస్తోంది. నా పర్యటన ద్వారా రెండు దేశాలకు మేలుచేసే కార్యక్రమాలకు పునాదులు పడతాయి. ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి నుంచి ఇంధనం, రక్షణ రంగాల్లో ప్రధాన అంశాలపై చర్చలు జరుపుతాం" అని బోరిస్ జాన్సన్ అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Britain, Britain prime minister

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు