హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Exclusive: ఆధార్ భద్రత కోసం యూఐడీఏఐ కొత్త ప్రయోగం.. ఏకంగా హ్యాకర్లను దించుతోంది! చదివితే ఆశ్చర్యపోతారు..

Exclusive: ఆధార్ భద్రత కోసం యూఐడీఏఐ కొత్త ప్రయోగం.. ఏకంగా హ్యాకర్లను దించుతోంది! చదివితే ఆశ్చర్యపోతారు..

ఆధార్ భద్రత కోసం యూఐడీఏఐ  కొత్త ప్రయోగం ఏకంగా హ్యాకర్లను దించుతోంది!.. చదివితే ఆశ్చర్యపోతారు..

ఆధార్ భద్రత కోసం యూఐడీఏఐ కొత్త ప్రయోగం ఏకంగా హ్యాకర్లను దించుతోంది!.. చదివితే ఆశ్చర్యపోతారు..

సెక్యూరిటీ సిస్టమ్‌లో ఉన్న సాంకేతిక లోపాలు గుర్తించడానికి బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). ఈ ప్రోగ్రామ్‌ కోసం 20 మంది టాప్ హ్యాకర్ల (Top Hackers)ను ఎంపిక చేసుకోనుంది.

ప్రస్తుత డిజిటల్ యుగంలో దాదాపు అన్ని పనులు డిజిటల్ పద్ధతిలోనే జరిగిపోతున్నాయి. అయితే ప్రజలు టెక్నాలజీ(Technology)ని ఎక్కువగా వాడే కొద్దీ సైబర్ అటాక్స్ (Cyber Attacks) కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు ఏ రంగాన్ని వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. ఆధార్ డేటాపై కూడా వీరి కన్ను పడింది. ఈ నేపథ్యంలోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 132 కోట్ల భారతీయుల ఆధార్ డేటాను రక్షించేందుకు నడుంబిగించింది. ఈ సంస్థ దాని సెక్యూరిటీ సిస్టమ్‌లో ఉన్న సాంకేతిక లోపాలు గుర్తించడానికి బగ్ బౌంటీ ప్రోగ్రామ్ (Bug Bounty Programme)కి శ్రీకారం చుట్టింది. ఈ ప్రోగ్రామ్‌ కోసం 20 మంది టాప్ హ్యాకర్ల (Top Hackers)ను ఎంపిక చేసుకోనుంది.

కొంతకాలం నుంచి ఆధార్ డేటా సెక్యూరిటీలో సాంకేతిక లొసుగులు ఉన్నట్లు కొందరు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని ఆధార్ సంస్థ ఎథికల్ హ్యాకర్లను రంగంలోకి దింపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్లోని సాంకేతిక సమస్యలను ఎథికల్ హ్యాకర్లు(Hackers గుర్తించి తెలియజేస్తారు. అలాంటి హ్యాకర్లలో టాప్ 20 హ్యాకర్లను నియమించేందుకు ఆధార్ సంస్థ నిర్ణయించింది. జులై 13న UIDAI జారీ చేసిన ఉత్తర్వును న్యూస్18 మీడియా యాక్సెస్ చేసింది. ఈ ఉత్తర్వులో ఆధార్ సిస్టమ్‌లలో బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను అమలు చేయాలని UIDAI నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


నిబంధనలు, షరతులు

ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ డేటాబేస్ అయిన 132 కోట్ల భారతీయుల ఆధార్ డేటాను స్టోర్ చేసే UIDAI సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీని (CIDR) పరిశీలించడానికి 20 మంది వ్యక్తిగత హ్యాకర్లు లేదా గ్రూప్‌లకు సంస్థ యాక్సెస్ అందించనుంది. ఈ హ్యాకర్లు HackerOne, Bugcrowd వంటి బగ్ బౌంటీ లీడర్స్ బోర్డ్‌లో టాప్ 100లో లిస్ట్ అయి ఉండాలి. లేదా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్ లేదా యాపిల్ వంటి ప్రముఖ కంపెనీలు నిర్వహించే బౌంటీ ప్రోగ్రామ్‌లలో లిస్ట్‌ అయి ఉండాలని UIDAI తన ఆర్డర్ తెలిపింది. లేదంటే హ్యాకర్లు బగ్ బౌంటీ కమ్యూనిటీ లేదా ప్రోగ్రామ్‌లలో యాక్టివ్‌గా ఉండాలి. అలానే వారు గతంలో వ్యాలిడ్ బగ్‌లను సబ్మిట్ చేసి ఉండాలి. గత ఏడాది సమయంలో సాంకేతిక సమస్యలను గుర్తించి ఓ బహుమతి గెలుచుకున్నా ఈ ప్రోగ్రామ్‌కి అర్హులేనని UIDAI ఉత్తర్వులో పేర్కొంది. హ్యాకర్లు UIDAIతో నాన్-డిస్‌క్లోజర్ ఒప్పందంపై సంతకం చేసి దాని సూచనలకు కట్టుబడి ఉండాలి. ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేసిన 20 మంది హ్యాకర్లకు వ్యాలిడ్ ఆధార్ నంబర్‌ ఉండటం తప్పనిసరి, అలానే వారందరూ భారతీయ నివాసితులై ఉండాలి.

ప్రభుత్వ సంస్థలలో ఇదే తొలిసారి

ఈ రకం ప్రోగ్రామ్‌ను నిర్వహించే మొదటి ప్రభుత్వ సంస్థగా UIDAI నిలుస్తోంది. సమస్యలను గుర్తించినందుకు ఎథికల్ హ్యాకర్లకు ఆ ప్రభుత్వ సంస్థ డబ్బు చెల్లిస్తుందా లేదా అనేది తెలియాలి. ఏ హ్యాకర్ కూడా గత ఏడు సంవత్సరాలలో UIDAI లో ఉద్యోగి అయి ఉండకూడదు. ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగి లేదా దాని కాంట్రాక్ట్ టెక్నాలజీ సపోర్ట్, ఆడిట్ సంస్థలలో ఉన్నవారు కూడా ఈ ప్రోగ్రామ్‌కు అనర్హులు. సెక్యూర్, సేఫ్ ఆధార్ సేవలను ప్రజలకు అందించేందుకు సెక్యూరిటీని బలోపేతం చేయడానికి UIDAI స్థిరంగా వ్యూహాత్మక సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ చేపడుతుందని జులై 13న జారీ చేసిన ఓ ఉత్తర్వు పేర్కొంది.

Published by:Mahesh
First published:

Tags: Cyber Attack, CYBER CRIME, Hackers, UIDAI

ఉత్తమ కథలు