హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఆధార్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ వచ్చేస్తోంది!

ఆధార్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ వచ్చేస్తోంది!

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లన్నీ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌తో వస్తున్నాయి. యూజర్లు ఇలా 4జీ స్పీడ్‌లో అప్‌డేట్ అవుతుంటే... ఆధార్ సంస్థ కూడా వారితో పోటీ పడుతోంది. సెప్టెంబర్ 15న ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది యూఐడీఏఐ.

  సెప్టెంబర్ 15న ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యూఐడీఏఐ ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి ఈ ఫీచర్ జూలై 1నే రావాల్సింది. కానీ ఆగస్ట్ 1 నుంచి అన్నారు. అదీ వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్ 15 అని ముహూర్తం ప్రకటించారు. మొత్తానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లాగా ఆధార్ సంస్థ కూడా ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ని ప్రకటించేసింది.

  అసలేంటి ఈ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్?

  స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవారికి ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ గురించి బాగా తెలుసు. ఒకసారి ఫోన్‌లో యూజర్ ముఖకవళికలు రికార్డ్ చేస్తే... సెల్ఫీ కెమెరా యూజర్ ఫేస్‌ని గుర్తించినప్పుడల్లా ఫోన్ అన్‌లాక్ అవుతుంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తుంది. అలాగే ఇప్పుడు ఆధార్‌కు కూడా ఇదే ఫీచర్ రానుంది. ప్రస్తుతం కనుపాపల స్కాన్, వేలి ముద్రల ద్వారా ఆధార్ ఆథెంటికేషన్ చేస్తున్నారు. కొన్నిసార్లు వేలిముద్రలు, ఐరిస్ సరిగ్గా రీడ్ కాకపోవడంతో ఆథెంటికేషన్ సమస్యగా మారింది. అందుకే యూఐడీఏఐ... ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌తో పౌరుల ఆధార్ డేటా దుర్వినియోగం కాకుండా అదనపు భద్రత లభిస్తుంది. వేలిముద్రలు, ఐరిస్‌లాగే ఫేస్ రికగ్నిషన్ పనిచేస్తుంది.

  First published:

  Tags: AADHAR, UIDAI

  ఉత్తమ కథలు