Home /News /national /

UIDAI THINKING OF BIOMETRIC ENROLLMENT FOR KIDS AT A AGE OF THREE YEARS INSTEAD OF FIVE YEARS AK GH

Aadhar Biometrics: పిల్లల ఆధార్ విషయంలో కీలక మార్పులు.. అది సాధ్యమేనా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐదేళ్లకు బదులుగా మూడేళ్లు నిండిన పిల్లలకు కూడా బయోమెట్రిక్ వివరాలు తీసుకోవాలనే అంశంపై చర్చించేందుకు UIDAI ఢిల్లీలో నిర్వహించిన మూడు రోజుల సమావేశం గురువారం ముగిసింది. మూడేళ్ల నుంచే పిల్లలకు బయోమెట్రిక్ వివరాలు తీసుకోవాలనేది UIDAI సీఈవో సౌరభ్ గార్గ్ ఆలోచనగా తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
మూడేళ్ల పిల్లలకు కూడా ఆధార్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది ఆధార్ కార్డులు జారీచేసే UIDAI సంస్థ. ఐదేళ్లకు బదులుగా మూడేళ్లు నిండిన పిల్లలకు కూడా బయోమెట్రిక్ వివరాలు తీసుకోవాలనే అంశంపై చర్చించేందుకు UIDAI ఢిల్లీలో నిర్వహించిన మూడు రోజుల సమావేశం గురువారం ముగిసింది. మూడేళ్ల నుంచే పిల్లలకు బయోమెట్రిక్ వివరాలు తీసుకోవాలనేది UIDAI సీఈవో సౌరభ్ గార్గ్ ఆలోచనగా తెలుస్తోంది. ‘‘చిన్న వయస్సులోని పిల్లలను ఎలా చేర్చుకోవాలనే ప్రశ్న నుంచి ఈ ఆలోచన వచ్చింది. ప్రస్తుతానికి మేము ఐదేళ్ల పిల్లలకే బయోమెట్రిక్స్ నమోదు చేస్తున్నాం. అయితే మూడేళ్ల నుంచే ఇలా ఎందుకు చేయకూడదని ప్యానల్ అభిప్రాయపడింది. మూడేళ్లకే పిల్లల వేలిముద్రలు స్థిరంగా మారుతాయని పరిశోధనలు చెబుతున్నాయి’’ సమావేశాల ముగింపులో గార్గ్ చెప్పారు.

అప్పుడే పుట్టిన పిల్లలకు ఐదేళ్ల వరకు ఆధార్ నంబర్ ఇస్తున్నారు. కానీ అది వారి తల్లిదండ్రుల ఆధార్ నంబరుతో లింక్ చేసి ఉంటుంది. పిల్లలకు ఐదేళ్లు నిండిన తరువాత మాత్రమే బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. దీన్ని 15 సంవత్సరాల తరువాత మళ్లీ అప్ డేట్ చేసుకోవాలి.

బయోమెట్రిక్ తీసుకునే కనీస వయస్సును ఐదేళ్ల నుంచి మూడుకు తగ్గించాలని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనిల్ జైన్ ఈ సమావేశంలో ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూడేళ్లకే ఇలా చేయడం ద్వారా ఏ బిడ్డకు టీకాలు వేశారో, వారు ప్రభుత్వ ఆహార కార్యక్రమాల ద్వారా లబ్దిపొందుతున్నారో తెలుసుకోవడం వీలవుతుందని జైన్ వివరించారు. వయసు విషయంలో కచ్చితమైన నిర్ణయమే తీసుకున్నామని చెప్పారు. మనదేశంలో ఏటా 25 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. అంటే ఐదేళ్లలో కోటి 25 లక్షల మంది పుడతారు. ఐదేళ్ల తరువాత బయోమెట్రిక్ చేయడం వల్ల దేశంలో కోటి 25 లక్షల మంది ఆధార్ లేకుండా ఉండాల్సి వస్తోందని ఆయన గుర్తుచేశారు.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రమాణాల ప్రకారం మూడు సంవత్సరాల పిల్లలు సూచనలను అనుసరించి అర్థం చేసుకుంటారని జైన్ గుర్తుచేశారు. కాబట్టి మూడు సంవత్సరాల వయస్సులో పిల్లల బయోమెట్రిక్ నమోదు ప్రారంభించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఫేస్ క్యాప్ఛర్, ఐరిస్ స్కానర్, వేలి ముద్రల గురించి వారికి అర్థం అయ్యేలా చెప్పవచ్చన్నారు. ఇప్పటికే ఉన్న ఆధార్ నమోదు వ్యవస్థ ద్వారా మూడేళ్ల పిల్లల బయోమెట్రిక్ తీసుకోవచ్చని జైన్ సిఫార్సు చేశారు.

Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ఆధార్ ఇవ్వడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు జైన్ తెలిపారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రేమ్ వర్క్‌కు లోబడి, వ్యక్తిగత గోప్యత బిల్లుకు అనుగుణంగా ఆధార్ ఉపయోగిస్తూ.. ప్రైవేటు రంగం ద్వారా రాయితీలు ఎలా ఇవ్వాలనే దానిపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. ఏదైనా ఒక ప్రయోజనం కోసం ఆధార్ ఉపయోగించడానికి సిద్దంగా ఉంటే, ఈ విధానాన్ని ప్రోత్సహించాలని చెబుతున్నారు గార్గ్. ఆధార్ ధ్రువీకరణకు ఫేస్, వాయిస్ రికగ్నిషన్‌తో పాటు, స్మార్ట్ ఫోన్ల ద్వారా ఫింగర్ ఫ్రింట్స్ ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఉదయ్ సీఈవో జైన్ ఈ సమావేశంలో చర్చించారు.

Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:Kishore Akkaladevi
First published:

Tags: AADHAR

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు