Home /News /national /

UIDAI SUSPENDED TWO ONLINE SERVICES FOR AADHAAR CARD UPDATE THESE TWO SERVICES ARE NO LONGER AVAILABLE IN UADAI WEBSITE JNK GH

Aadhaar Card Update: ఆధార్‌కు సంబంధించిన రెండు సేవలను ఆపేసిన UIDAI.. వాటిని ఎలా పొందాలి?

ఆధార్‌కు సంబంధించి ఆ రెండు సేవలు నిలిపివేత.. (ప్రతీకాత్మక చిత్రం)

ఆధార్‌కు సంబంధించి ఆ రెండు సేవలు నిలిపివేత.. (ప్రతీకాత్మక చిత్రం)

గతేడాది నుంచి ఆధార్ లో ఎన్నో మార్పులు చేస్తూ వస్తున్న యూఐడీఏఐ వాటికి తగినట్లుగా కొన్ని పాత సేవలను ఆపేస్తోంది. అవేంటంటే..

భారత్​లో ప్రతి ఒక వ్యక్తి కలిగి ఉండాల్సిన ముఖ్యమైన ఐడెంటిఫికేషన్ కార్డుల్లో (ID Card) ఆధార్ (Aadhaar) ప్రధానమైనది. బ్యాంక్​ అకౌంట్ (Bank Account)​ తెరవడం దగ్గర్నుంచి ఇళ్లు కొనడానికి, వాహనాలు కొనడానికి, స్కూల్ లేదా కాలేజీలో చేరేందుకు కూడా ప్రస్తుతం ఆధార్ తప్పనిసరిగా మారింది. అందుకే మన దేశానికి చెందిన వ్యక్తుల నిత్య జీవితంలో ఇది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవలి కాలంలో ఆధార్ కార్డులు జారీ చేసే సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) (UIDAI) ఆధార్ కి సంబంధించి కొన్ని సర్వీసులను ఆపేసింది. గతేడాది నుంచి ఆధార్ లో ఎన్నో మార్పులు చేస్తూ వస్తున్న యూఐడీఏఐ వాటికి తగినట్లుగా కొన్ని పాత సేవలను ఆపేస్తోంది. అవేంటంటే..

ఆధార్ ప్రూఫ్ వాలిడేషన్ లెటర్
అడ్రస్ వాలిడేషన్ లెటర్​ని ప్రూఫ్​గా తీసుకొని ఒక వ్యక్తి అడ్రస్​ని ఆధార్​లో మార్పులు చేయడం గతంలో అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతం ఈ సేవను నిలిపివేస్తున్నట్లుUIDAI ప్రకటించింది. అధికారిక వెబ్ సైట్ నుంచి కూడా ఈ సేవకు సంబంధించిన సమాచారాన్ని డిలీట్ చేసింది. అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇది కొద్దిగా కష్టాన్ని కలిగించేదే కావచ్చు. అందుకే ట్విట్టర్ వేదికగా చాలామంది UIDAI ని ఈ సేవల గురించి అడిగారు. అయినా ఈ సేవలు నిలిపేసినట్లుగా UIDAI ప్రకటించింది. ఇతర రెసిడెన్షియల్ ప్రూఫ్స్ ఉపయోగించి మీ అడ్రస్ ప్రూఫ్ ని UIDAI పోర్టల్ ద్వారా మీ అడ్రస్ ని అప్ డేట్ చేసుకునే సదుపాయం అయితే ఉంది.

ఆధార్ కార్డ్ రీప్రింట్
పాత ఫార్మాట్లలో ఆధార్ కార్డును ప్రింట్ చేయడం ఆపేసింది UIDAI. ఇకపై కేవలం పీవీసీ కార్డులను మాత్రమే ప్రింట్ చేయనుంది. డెబిట్ కార్డు సైజులో ఉండే ఈ కార్డు ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు సులువుగా ఉండడమే ఇందుకు కారణం. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఈ కొత్త కార్డులను రీప్రింట్ చేయించుకోవచ్చు. లేకపోతే మీరే ఈ ఆధార్ కార్డులను ప్రింట్ అవుట్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. దీని గురించి చెబుతూ “ఆధార్ రీప్రింట్ సర్వీసులను నిలిపివేశాం.మీరు పీవీసీ కార్డును ఆన్ లైన్​లో ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా మీకు మీరే ఈ ఆధార్ ని ప్రింట్ అవుట్ తీసుకొని పేపర్ ఫార్మాట్ లో ఉంచుకోవచ్చు.”అని వెల్లడించింది.

మీ అడ్రస్ ని ఆన్ లైన్​లో మార్చుకోవడం ఎలా..
ఆన్ లైన్ లో అడ్రస్ ని మార్చుకోవడానికి ముందుగా UIDAI అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో మై ఆధార్ సెక్షన్ పై క్లిక్ చేయాలి. డ్రాప్ డౌన్ మెనూలో వచ్చిన అప్ డేట్ ఆధార్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.
లేదానేరుగా https://ssup.uidai.gov.in/ssup/ లింక్​ని క్లిక్​ చేసి అడ్రస్​ మార్చుకోవచ్చు. లింక్​పై క్లిక్​ చేశాక.. ఆధార్​ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్​లో ప్రొసీడ్ టు అప్ డేట్ ఆధార్ అనే బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డు, మీ ఇతర వివరాలు అందించి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ కొత్త అడ్రస్​ని పూర్తిగా ఎంటర్ చేయాలి. ఆఖరి స్టెప్ గా UIDAI అనుమతించిన 32 డాక్యుమెంట్లలో ఏదైనా ఒక డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడే వాటి లిస్టు కూడా ఉంటుంది. ఇందులో పాన్​కార్డ్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం ఇష్యూ చేసిన ఏదైనా ఫొటో ఐడీ కార్డు వంటి 32 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Published by:John Naveen Kora
First published:

Tags: Aadhaar, Aadhaar card, UIDAI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు