Home /News /national /

UIDAI HAS JOINED HANDS WITH ISRO NOW YOU CAN SEE WHERE THE AADHAAR CENTERS ARE LOCATED IN THE NEARBY AREAS UMG GH

Aadhaar Update: మీ దగ్గర్లో ఆధార్ సెంటర్ తెలుసుకోవాలా..? దీన్ని ఫాలో అయితే చిటికలో ఇన్ఫర్మేషన్ మీ ముందు..!

 ఇస్రోతో చేతులు కలిపిన యూఐడీఏఐ.. ఇక మీదగ్గర ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ఇలా చూసి తెలుసుకోవచ్చు..!

ఇస్రోతో చేతులు కలిపిన యూఐడీఏఐ.. ఇక మీదగ్గర ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ఇలా చూసి తెలుసుకోవచ్చు..!

ISRO, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కలిసి UIDAI భువన్ ఆధార్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌ ద్వారా సమీప ఆధార్(Aadhar) కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. నివాసితుల అవసరాల ఆధారంగా లొకేషన్ వారీగా సంబంధిత ఆధార్ కేంద్రాలను సెర్చ్‌ చేయొచ్చు.

ఇంకా చదవండి ...
భారత ప్రజలకు ఇప్పుడు ఆధార్‌ కార్డ్ నిత్యావసరంలా మారింది. అన్ని రకాల సేవలు ఆధార్‌ కార్డ్‌తో ముడిపడి ఉంటున్నాయి. బ్యాంకు(Bank) అకౌంట్‌లు, వివిధ ప్రభుత్వ పథకాలకు, ఇతర కార్యకలాపాలకు ఆధార్‌ తప్పనిసరి. దేశ ప్రజలకు 12 అంకెల ఆధార్ నంబర్‌ను యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) అందజేస్తుంది. ఈ సంస్థ భువన్‌ ఆధార్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ISRO)కి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC)తో కలిసి పని చేస్తోంది. ఆధార్ కార్డ్ హోల్డర్‌లకు భారతదేశం అంతటా ఉన్న ఆధార్ కేంద్రాల సమాచారం, లొకేషన్‌ తెలుసుకునేందుకు పోర్టల్‌ ఉపయోగపడుతుంది.

ISRO, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కలిసి UIDAI భువన్ ఆధార్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌ ద్వారా సమీప ఆధార్ కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. నివాసితుల అవసరాల ఆధారంగా లొకేషన్ వారీగా సంబంధిత ఆధార్ కేంద్రాలను సెర్చ్‌ చేసే సదుపాయాన్ని కూడా ఈ పోర్టల్ అందిస్తుంది.

దీనికి సంబంధించి జులై 15న UIDAI ఓ ట్వీట్‌ చేసింది. ‘భారత ప్రజల కోసం ఈజ్ ఆఫ్ లివింగ్‌ని మెరుగుపరచడానికి UIDAI నిరంతరం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆధార్ కేంద్రాల జియో-స్పేషియల్ డిస్‌ప్లేను సులభతరం చేసే ‘భువన్ ఆధార్’ పోర్టల్‌ను పరిచయం చేసింది.’ అని ట్వీట్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

భువన్ ఆధార్ పోర్టల్‌ని ఉపయోగించి సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని మూడు మార్గాల్లో గుర్తించవచ్చు..
- ఆధార్ సేవా కేంద్రం ద్వారా సెర్చ్‌ చేయవచ్చు
- పిన్ కోడ్ ద్వారా సెర్చ్‌ చేయవచ్చు
- రాష్ట్రాల వారీగా ఆధార్ సేవా కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు

ఆధార్‌ కేంద్రాల పూర్తి సమాచారం అందుబాటులో..
https://bhuvan.nrsc.gov.in/aadhaar/ లింక్‌ని ఉపయోగించి భువన్ ఆధార్ పోర్టల్‌లోకి వెళ్లినప్పుడు.. భారతదేశం మ్యాప్‌ కనిపిస్తుంది. వివిధ భాగాలలో ఆధార్ కేంద్రాల సంఖ్యను సూచించే సర్కిల్‌లు ఉంటాయి. స్క్రీన్ ఎడమ వైపున నాలుగు ఆప్షన్‌లతో మెనూ కనిపిస్తుంది. సమీపంలోని కేంద్రాలు, ఆధార్ సేవా కేంద్రం ద్వారా సెర్చ్‌ చేయండి, పిన్ కోడ్‌ ద్వారా సెర్చ్‌ చేయండి, రాష్ట్రాల వారీగా ఆధార్ సేవా కేంద్రం వివరాలు తెలుసుకోండి అనే ఆప్షన్లు కనిపిస్తాయి. సమీప ఆధార్ కేంద్రాన్ని కనుగొనడానికి ఈ నాలుగు ఆప్షన్‌లలో దేన్నైనా ఎంచుకోవచ్చు.



యూఐడీఏఐ, ఎన్‌ఆర్‌ఎస్‌సీ మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలియజేసింది. NRSC భారతదేశం అంతటా ఆధార్ కేంద్రాల సమాచారం, లొకేషన్‌ అందించే భువన్-ఆధార్ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తుందని పేర్కొంది. భువన్ ఆధార్ పోర్టల్ కంప్లీట్‌ జియోగ్రాఫికల్‌ ఇన్‌ఫర్మేషన్‌ స్టోరేజ్‌, పునరుద్ధరణ, ఆధార్ కేంద్రాల కోసం అనాలసిస్‌, రిపోర్టింగ్‌ను సులభతరం చేస్తుందని వివరించారు. నేచురల్‌ కలర్‌ హై రిజల్యూషన్ బ్యాక్‌డ్రాప్‌తో శాటిలైట్ పిక్చర్స్‌ను అందిస్తుందని పేర్కొన్నారు.
Published by:Mahesh
First published:

Tags: AADHAR, Cyber Attack, ISRO, UIDAI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు