మహారాష్ట్ర(Maharashtra) రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray Resign) రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే తన రాజీనామా ప్రకటించారు. ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడిన ఉద్ధవ్ తన నిర్ణయాన్ని వెలువరించారు. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నట్లు ఉద్దవ్ చెప్పారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందని..ఆ దిష్టి ఎవరిదో అందరికీ తెలుసని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. తన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బాలాసాహెబ్ ఆశయాలు నెరవేర్చిందన్నారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు
రాజీనామాకు ముందు
ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్ బుధవారం సాయంత్రం భేటీ అయ్యింది. రాష్ట్రంలో రెండు నగరాల పేర్లను మర్చుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్‌గా,ఉస్మానాబాద్ పేరు ధారా శివ్‌గా మార్చింది. నవీముంబై ఎయిర్‌పోర్టు పేరును డీబీ పాటిల్ ఎయిర్‌పోర్టుగా మారుస్తూ ఉద్ధవ్ ఠాక్రే కేబినేట్ ఆమోదం తెలిపింది. కాగా, కేబినెట్ మీటింగ్‌లో ఉద్వేగభరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం ఉద్దవ్ ధన్యవాదాలు తెలిపారు. తన వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించాలని కోరారు. తన వాళ్లే తనను మోసం చేశారని, ఈ పరిస్థితికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. భేటీ అనంతరం మీడియాకు నమస్కరించి ఉద్దవ్ వెళ్లిపోయారు.
Dutch MP Geert Wilder : ఇస్లాం పట్ల మెతక వైఖరి వద్దు..ఉదయ్ పూర్ హత్య ఘటనపై డచ్ ఎంపీ
అంతకుముందు, అసెంబ్లీలో బలపరీక్షను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన శివసేనకు ఎలాంటి ఊరట లభించలేదు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం అసెంబ్లీలో గురువారం బలపరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గవర్నర్ భగత్ సింగ్ కోశియారి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటు వల్ల మహారాష్ట్రలో తలెత్తిన అన్ని రాజకీయ సంక్షోభాలకు ఫ్లోర్ టెస్ట్ ఒక్కటే మార్గమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharastra, Shiv Sena, Uddhav Thackeray