TIKTOK : ప్రాణం తీసిన టిక్‌టాక్ పిచ్చి.. ఇద్దరు యువకుల మృతి..

TIKTOK : రైలు ఢీకొడుతుందన్న భయం కూడా లేకుండా టిక్‌టాక్ వీడియో కోసం వారు చేసిన రిస్క్ చివరకు విషాదంగా మిగిలింది.

news18-telugu
Updated: September 29, 2019, 2:50 PM IST
TIKTOK : ప్రాణం తీసిన టిక్‌టాక్ పిచ్చి.. ఇద్దరు యువకుల మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టిక్‌టాక్ పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఇటీవల తరుచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బెంగళూరులో ఇద్దరు యువకులు టిక్‌టాక్ వీడియో చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. అబ్జద్(19),మహమ్మద్ మత్తి(22),జలీబుల్లా(22) అనే ముగ్గురు యువకులు శుక్రవారం సాయంత్రం 5.30గంటలకు ఆర్కే హెగ్దేనగర్ రైల్వేగేటు సమీపంలో రైలు పట్టాలపై వీడియో చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో కోలార్-చిక్‌బళ్లాపూర్-బెంగళూరు ట్రైన్ వస్తుండగా.. పట్టాలపై నిలబడి ఓ వీడియో షూట్ చేయడం మొదలుపెట్టారు.
రైలు ఢీకొడుతుందన్న భయం కూడా లేకుండా టిక్‌టాక్ వీడియో కోసం వారు చేసిన రిస్క్ చివరకు విషాదంగా మిగిలింది. ఆ ముగ్గురిని రైలు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.అంతకుముందు ఇదే కర్ణాటకలో టిక్‌టాక్ వీడియో చేస్తూ 22 ఏళ్ల ఓ సింగర్ మృతి చెందాడు. టిక్‌టాక్ కోసం అతను చేసిన స్టంట్ బెడిసికొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని తూమకూరులో జూన్‌లో ఈ ఘటన జరిగింది.

First published: September 29, 2019, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading