సియాచిన్‌లో మంచు తుఫాను...ఇద్దరు భారత సైనికుల మృతి...

మంచు కింద కొంతమంది సైనికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ సహాయంతో సైనికులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా మంచులో కూరుకుపోయిన ఇద్దరు సైనికుల పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: November 30, 2019, 9:54 PM IST
సియాచిన్‌లో మంచు తుఫాను...ఇద్దరు భారత సైనికుల మృతి...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
భారత్ పాక్ సరిహద్దు ప్రాంతమైన సియాచిన్ లో మంచు తుఫాను చెలరేగి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రంగా పేరొందిన సియాచిన్ ప్రాంతం సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఉంది. కాగా సోమవారం దక్షిణ సియాచెన్ గ్లేషియర్ లో సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో భారీగా మంచు పెల్లలు విరిగిపడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఈ మంచు కింద కొంతమంది సైనికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ సహాయంతో సైనికులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా మంచులో కూరుకుపోయిన ఇద్దరు సైనికుల పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే రెండు వారాల క్రితం సియాచిన్ లో మంచు తుఫాను భీబత్సం సృష్టించడంతో 4 జవాన్లతోపాటు మరో ఇద్దరు కూలీలు మరణించారు.

First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>