news18-telugu
Updated: September 19, 2020, 1:33 PM IST
ప్రతీకాత్మక చిత్రం
దేశంలోని 14 అతిపెద్ద జూపార్క్‌లలో ఒకటైన భువనేశ్వర్‌లోని నందన్కనన్ జూపార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. జూలో రెండు రోజుల వ్యవధిలోనే.. రెండు బద్ధకపు ఎలుగుబంట్లు మృతిచెందాయి. రెండు కూడా ఒకరకమైన లక్షణాలతో బాధపడుతూ మరణించడం జూ అధికారులను కలవరానికి గురిచేస్తోంది. ఏదైనా బ్యాక్టీరియ గానీ, వైరల్ ఇన్ఫెక్షన్ గానీ వ్యాప్తి చెందుతుందోమోనని జూ అధికారులు ఆందోళన చెందున్నారు. అలా జరిగితే మిగతా జంతువులకు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం రోజున ఆర్తి పేరుగల 25 ఏళ్ల ఆడ బద్దకపు ఎలుగుబంటి తీవ్ర రక్తస్రావం కావడంతో మరణించింది. అంతకు ముందు రోజు 7 సంవత్సరాలు వయసు గల మగ బద్దకపు ఎలుగుబంటి కూడా అదే రకమైన లక్షణాలతో మృతిచెందింది. కాగా, ఆర్తిని 2013 సెప్టెంబర్‌లో రాంచీ జూ నుంచి తీసుకుని వచ్చారు. సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తన బోన్లోనే చెట్లు ఎక్కుతూ.. జూ మొత్తంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది.
ఈ రెండు ఎలుగుబంట్ల మృతికి గల వాస్తవ కారణాలు మాత్రం తెలియలేదు. పోస్టుమార్టమ్ నివేదికలో మాత్రం.. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎలుగుబంట్లు మరణించినట్టుగా తేలింది. అయితే దీనిపై నందన్కనన్ జూ పార్క్ డైరెక్టర్ శశి పాల్ మాట్లాడుతూ.. ఎలుగుబంట్ల మృతికి గల కారణాలపై ధ్రువీకరణం కోసం.. భువనేశ్వర్‌లోని ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలోని వైల్డ్ లైఫ్ హెల్త్ కేంద్రం నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్ట తెలిపారు.మగ ఎలుగుబంటి కొద్ది రోజులుగా నీరసంగా ఉందని.. కానీ ఆడ ఎలుగుబంటికి మాత్రం ముందు రోజు సాయంత్రం వరకు ఎటువంటి సమస్య లేదని చెప్పారు. జూలో ఇంకా 15 బద్దకపు ఎలుగుబంట్లు ఉన్నాయని.. వాటిని వేర్వేరుగా సెపరేట్ బోన్లలో ఉంచామని తెలిపారు. అయితే ఈ వ్యాధి సంక్రమణ జరిగే అవకాశం ఉన్నందున ఆందోళన కలుగుతుందన్నారు.
Published by:
Sumanth Kanukula
First published:
September 19, 2020, 1:33 PM IST