విషాదం.. తమ్ముడి మరణవార్త విని గుండెపోటుతో చనిపోయిన ఇద్దరు అక్కలు..

మాజిద్ గుండె నొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో అతడిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు.

news18-telugu
Updated: July 24, 2020, 11:12 AM IST
విషాదం.. తమ్ముడి మరణవార్త విని గుండెపోటుతో చనిపోయిన ఇద్దరు అక్కలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారు ముగ్గురు అక్కాతమ్ముళ్లు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరిని విడిచి మరొకరు విడిచి ఉండలేనంత ప్రేమ, ఆప్యాయతలు. బహుశా అందుకేనేమో.. ఒకరు చనిపోయారని తెలియగానే మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెళగావి సమీపంలోని పంత్బలేకుంద్రి గ్రామానికి చెందిన అబ్దుల్ మాజిద్ జమదార్(57)కు ఇద్దరు అక్కలు. ఒకరు హుస్సేన్ బీ ముల్లా(64), మరొకరు సహారామీ సనాది(70). ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేయడంతో వేర్వేరు గ్రామాల్లో ఉంటున్నారు. అయితే తమ్ముడు అబ్దుల్ మాజిద్ డయాబెటిస్ పెషంట్. మంగళవారం మాజిద్ గుండె నొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు.

కానీ కరోనా వైరస్ నేపథ్యంలో అతడిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష రిపోర్టు ఉంటేనే చేర్చుకుంటామని ఆస్పత్రి అధికారులు తేల్చి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు మాజిద్‌ను బెలగావిలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే అతడికి కోవిడ్-19 పరీక్షను నిర్వహించారు. అయితే పరీక్ష ఫలితం రాకముందే.. తీవ్రమైన గుండెనొప్పితో మాజీద్ జమదార్ మరణించాడు. అనంతరం వచ్చిన రిపోర్టులో అతడికి కరోనా నెగిటివ్‌గా తేలింది. మాజీద్ మరణ వార్త తెలియగానే అక్క హుస్సేన్ బీ ముల్లాకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

మరో అక్కసహారాబీ సనాది సైతం తమ్ముడి మృతదేహాన్ని ఇంటికి తరలించే క్రమంలో గుండెపోటుతో చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘటన స్థానికంగా తీరని విషాదాన్ని మిగిల్చాయి. అయితే ముగ్గురు అక్కాతమ్ముళ్లకు బేలగావికి 15 కిలోమీటర్ల దూరంలోని వారి స్వగ్రామమైన పంత్బలేకుంద్రి గ్రామంలో ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు.
Published by: Narsimha Badhini
First published: July 24, 2020, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading