హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పంద్రాగస్టు ముందు ఉగ్రవాదుల బీభత్సం.. కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి

పంద్రాగస్టు ముందు ఉగ్రవాదుల బీభత్సం.. కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి

ఘటనా స్థలంలో మోహరించిన పోలీసులు

ఘటనా స్థలంలో మోహరించిన పోలీసులు

స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు ఉగ్రవాదుల దాడి జరగడంతో అలర్ట్ ప్రకటించారు. శ్రీనగర్ వ్యాప్తంగా అదనపు బలగాలు భారీగా మోహరించాయి.

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. శ్రీనగర్‌ శివారులోని నౌగామ్ ప్రాంతంలో పోలీసుల కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. పోలీసులు తేరుకొనే లోపే బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడి నుంచి పరారయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన PCR హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులను ఇస్ఫాఖ్ ఆయుబ్ (715 IRP 20 బెటాలియన్), ఫయాజ్ అహ్మద్ (307 IRP 20 బెటాలియన్)గా గుర్తించారు. సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ మహమ్మద్ అష్రాఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


జైషే మహమ్మద్ ఉగ్రవాదులే కాల్పులు జరిపారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనతో పోలీసులతో పాటు ఆర్మీ అప్రమత్తమయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు ఉగ్రవాదుల దాడి జరగడంతో అలర్ట్ ప్రకటించారు. శ్రీనగర్ వ్యాప్తంగా అదనపు బలగాలు భారీగా మోహరించాయి. పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయిన ఉగ్రవాదుల కోసం నగరమంతటా గాలిస్తున్నారు. కాగా, పుల్వామా జిల్లా అవంతిపొరాలో జమ్ము కశ్మీర్ పోలీసులు, ఆర్మీకి చెందిన 50 రాష్ట్రీయ రైఫిల్స్, 130 సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

First published:

Tags: Jammu and Kashmir, Srinagar, Terror attack

ఉత్తమ కథలు