Home /News /national /

TWO PEOPLE HAVE DIED IN A BLAST INSIDE A COURT COMPLEX IN LUDHIANA IN PUNJAB SK

Punjab Blast: షాకింగ్.. కోర్టులో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

కోర్టులో పేలుడు

కోర్టులో పేలుడు

Punjab Court Blast: అసలు కోర్టులోకి అంతటి శక్తివంతమైన ఐఈడీ బాంబు ఎలా వచ్చిందన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

    పంజాబ్‌లో భారీ పేలుడు (Punjab Blast) సంభవించింది. లూథియానాలోని ఓ కోర్టు కాంప్లెక్స్‌లో బాంబు (Blast in Ludhiana Court) పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోర్టు కాంప్లెక్స్‌లో రెండో అంతస్తులో ఉన్న బాత్‌రూమ్‌లో మధ్యాహ్నం 12.22 గంటల నిమిషాలకు ఈ ఘటన జరిగింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  అది శక్తివంతమైన బాంబు కావచ్చని, ఆ పేలుడు ధాటికి బాత్‌రూమ్ గోడలు బద్ధలయ్యాయని ప్రత్యక్ష సాక్షలు పేర్కొన్నారు. పక్క గదుల్లో ఉండే కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాంబు పేలుడు ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.


    బాంబు పేలుడు ఘటనను శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బిర్ సింగ్ బాదల్ ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని..అధికారుల వైఫల్యమే ఘటనకు కారణమని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్ని అనుమానం వ్యక్తం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కొన్ని సంఘ విద్రోహక శక్తులు కుట్రలు చేశాయని.. వారి పట్లప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

    శారీరక సంబంధం పెట్టుకున్నాక.. పెళ్లికి నిరాకరిస్తే అది మోసం కాదు..హైకోర్టు

    కాగా, వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొన్ని రోజులుగా పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో పవిత్ర గురుగ్రంథ సాహిబ్‌ను అప‌విత్రం చేసేందుకు ప్ర‌య‌త్నించిన యువ‌కుడిని శ‌నివారం భక్తులు, స్థానికులు కొట్టి చంపారు. ఆ తర్వాత మరోచోట కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వాటిని మరవక ముందే ఇప్పడు ఏకంగా కోర్టులో బాంబు పేలడం సంచలనంగా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Explosion, Punjab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు