Home /News /national /

TWO PATIENTS TEST HIV POSITIVE IN VARANASI IN LAST TWO MONTHS AFTER GETTING TATTOOS ON THEIR BODIES PVN

HIV : శృంగారంలో పాల్గొనకపోయినా హెచ్ ఐవీ సోకుతోంది..ఎలానో తెలిస్తే షాక్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

HIV positive after getting tattoos : వారు అసురక్షిత శృంగారంలో పాల్గొనలేదు. హెచ్​ఐవీ సోకిన రక్తం ఎక్కించుకోలేదు. అయినా హెచ్​ఐవీ సోకింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగింది. ఈ ఇన్ఫెక్షన్ వెనుక ఉన్న కారణాన్ని కనుగొనే ప్రయత్నంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. దీంతో షాక్ అవ్వడం వారి వంతైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
HIV positive after getting tattoos : వారు అసురక్షిత శృంగారలో పాల్గొనలేదు. హెచ్​ఐవీ సోకిన రక్తం ఎక్కించుకోలేదు. అయినా హెచ్​ఐవీ(HIV) సోకింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(UttarPradesh) రాష్ట్రంలోని వారణాసి(Varanasi)లో జరిగింది. ఈ ఇన్ఫెక్షన్ వెనుక ఉన్న కారణాన్ని కనుగొనే ప్రయత్నంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. దీంతో షాక్ అవ్వడం వారి వంతైంది.

టాటూలు(Tattoos) వేయించుకోవడమనేది ఇప్పుడు ఫాష్యన్. రకరకాల టూటూలు వేయించుకుని యువతీ,యువకులు సంబురపడిపోతుంటారు. తల్లిదండ్రులు లేదా ప్రేమించిన వారి గుర్తుగా లేదా వారి లైఫ్​కి తగిన కోట్స్ టాటూ రూపంలో వేయించుకుని ఆనందిస్తారు. అయితే ఈ టాటూలు వేయించుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం అనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది ఈ ఘటన. వారణాసి జిల్లాలోని బరాగావ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు తన గ్రామంలో జరిగిన ఒక జాతరలో తన చేతికి టాటూ వేయించుకున్నాడు. టాటూ వేయించుకున్న కొన్ని రోజుల తర్వాత, అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. తీవ్ర జ్వరంతో బాధపడి బలహీనుడయ్యాడు. తనకు అన్ని విధాలుగా చికిత్స అందించినప్పటికీ, అతను కోలుకోలేదు కాబట్టి, వైద్యులు అతనికి హెచ్‌ఐవి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. పరీక్షల అనంతరం అతడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదని, తనకు ఎవరితోనూ శారీరక సంబంధం లేదని, ఎవరి రక్తం ఎక్కించుకోలేదని ఆ యువకుడు డాక్టర్‌కి చెప్పాడు. వారణాశి జిల్లాలోని నాగవాన్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అక్కడ ఒక మహిళ ఒక హాకర్ నుంచి పచ్చబొట్టు వేయించుకుంది. వెంటనే అనారోగ్యంగా అనిపించడం ప్రారంభించింది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలింది. వారణాసిలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) కార్యాలయం... జిల్లా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న ఇద్దరు రోగులు తమకు రక్తమార్పిడి చేయలేదని లేదా ఎటువంటి అసురక్షిత లైంగిక సంపర్కంలో పాల్గొనలేదని ధృవీకరించింది.



Donald Trump : ట్రంప్ కు బిగ్ షాక్..ఫ్లోరిడాలోని ఇంటిపై FBI దాడులు,లాకర్లు బద్దలు!

అయితే, వారి శరీరాలపై టాటూలు వేయించుకున్న తర్వాత వారికి హెచ్‌ఐవి పాజిటివ్ అని తేలింది. టాటూ వేయించుకున్నప్పటి నుంచి వారికి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని వెలుగులోకి వచ్చిందని యాంటీరెట్రోవైరల్ ట్రీట్మెంట్ (ART)సెంటర్ సీనియర్ డాక్టర్ ప్రీతీ అగర్వాల్ తెలిపారు. టాటూ కోసం ఉపయోగించిన సూదుల వల్లే వారికి హెచ్ ఐవీ సోకినట్లు ఆమె తెలిపింది. వాస్తవానికి, టాటూ వేయడానికి ఉపయోగించే సూదికి ఇన్ఫెక్షన్ సోకింది. ఈ కారణంతో వీరు పాజిటివ్‌గా తేలారు. టాటూలు వేసే సూదుల ధరలు అధికంగా ఉన్న కారణంగా డబ్బు ఆదా చేసుకునేందుకు కొన్ని షాపుల్లో ఇలా ఒకే సూదితో టాటూలు వేస్తున్నట్లు వైద్యురాలు ప్రీతి అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. సూది కొత్తదో, పాతదో నిర్ధరించుకున్న తర్వాతే పచ్చబొట్టు వేసుకోవాలని ఆమె సూచించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
Published by:Venkaiah Naidu
First published:

Tags: HIV, Varanasi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు