ప్రపంచాన్ని కరోనా (corona) మళ్లీ భయపెడుతోంది. తగ్గిపోయిందనుకున్న కోవిడ్ (Covid) మళ్లీ పడగలిప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు జరిగే పరిణామాలను బట్టి తెలుస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ (Omicron variant) పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హెచ్చరించారు. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న ఈ సౌతాఫ్రికా వేరియంట్ ఇండియాలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ (Omricron) వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకూ అది లొంగే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీ (Pm naredra modi)ఇవాళ (శనివారం) వివిధ శాఖల ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
2 గంటల పాటు సాగిన ఈ భేటీలో ఒమిక్రాన్ కట్టడికి సంబంధించి ప్రధాని పలు కీలక సూచనలు చేశారు. అయితే ఒమిక్రాన్‌పై భారత్ కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంటే సౌతాఫ్రికా (South Africa) నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్ట్ (Bengaluru Airport)కు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అత్యవసర సమావేశం
అధికారులు వీరిని వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంచారు. ఒమిక్రాన్ వేరియంటేనా అన్న నేపథ్యంలో నిర్థారణకోసం శాంపిల్స్‌ను ముంబయి ల్యాక్‌కు పంపించారు. బెంగళూరులో కరోనా కేసులు (corona cases) నమోదు కావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా కంటే ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఇక కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని మోదీ.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించారు.
డెల్టా కంటే ఇది అత్యంత ప్రమాదకారి కావచ్చనే..
కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారికీ ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకుతోంది. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది అత్యంత ప్రమాదకారి కావచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు వెలుగుచూసిన కోవిడ్ వేరియెంట్ల కంటే ఇది వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల హెచ్చరికలతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి.
దక్షిణాఫ్రికా సహా మొత్తం ఆరు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్ ఇప్పటికే ఆంక్షలు విధించింది. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, లెసాతో, ఎస్వాతిన్, జింబాబ్వే, నమీబియాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్‌లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Corona cases, South Africa