బోర్డర్‌లో కాల్పుల మోత.. ఇద్దరు పాకిస్తాన్ SSG కమాండోలు హతం

పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన BAT (బోర్డర్ యాక్షన్ టీమ్) చొరబాట్లకు యత్నించింది. ఈ క్రమంలో భారత ఆర్మీ పోస్టులపై దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఎదురు దాడి చేసింది.

news18-telugu
Updated: December 17, 2019, 3:33 PM IST
బోర్డర్‌లో కాల్పుల మోత.. ఇద్దరు పాకిస్తాన్ SSG కమాండోలు హతం
పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన BAT (బోర్డర్ యాక్షన్ టీమ్) చొరబాట్లకు యత్నించింది. ఈ క్రమంలో భారత ఆర్మీ పోస్టులపై దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఎదురు దాడి చేసింది.
  • Share this:
ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ కాల్పుల మోత మోగింది. కుక్క తోక వంకరలా బుద్ధి మార్చుకోని పాకిస్తాన్ ఆర్మీ.. కాల్పులతో రెచ్చిపోయింది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో భారత దళాలే టార్గెట్‌గా దాడులు చేసింది. పాక్ కాల్పులను భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇరువర్గాల కాల్పుల్లో ఒక భారత జవాన్ చనిపోగా.. ఇద్దరు పాకిస్తాన్ SSG (స్పెషల్ సర్వీసెస్ గ్రూప్) కమాండోలు హతమయ్యారు.

అసలేం జరిగిదంటే.. సోమవారం సాయంత్రం పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన BAT (బోర్డర్ యాక్షన్ టీమ్) చొరబాట్లకు యత్నించింది. ఈ క్రమంలో భారత ఆర్మీ పోస్టులపై దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఎదురు దాడి చేసింది. ఇరువర్గాల మధ్య రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్‌లో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ భీకర పోరులో భారత ఆర్మీకి చెందిన రైఫిల్ మ్యాన్ సుఖ్విందర్ సింగ్ మరణించారు. ఇక పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ఎస్ఎస్‌జీ కమాండోలు హతమయ్యారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యల నేపథ్యంలో LOC వెంబడి హైఅలర్ట్ ప్రకటించి భద్రతను పటిష్టం చేసింది భారత ఆర్మీ.

First published: December 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు