భారత జవాన్లు పని మొదలుపెట్టారు...ఇద్దరు ముష్కరులు హతం

కాల్పుల విరమణ పొడగింపు లేదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన వెంటనే తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు భారత జవాన్లు.

Janardhan V | news18
Updated: June 18, 2018, 12:59 PM IST
భారత జవాన్లు పని మొదలుపెట్టారు...ఇద్దరు ముష్కరులు హతం
ఫైల్ ఫోటో: జమ్ముకశ్మీర్‌లో భారత జవాన్ల అలర్ట్(Getty Images)
  • News18
  • Last Updated: June 18, 2018, 12:59 PM IST
  • Share this:
నెల రోజుల విరామానంతరం జమ్ముకశ్మీర్‌లో భారత జవాన్లు పని మొదలుపెట్టారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో కేంద్రం నెల రోజుల కాల్పుల విరమణ ప్రకటించడమే అదునుగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నాలుగు రోజులు అక్కడ హింసను సృష్టించారు. రంజాన్ మాసం ముగియడంతో కాల్పుల విరమణ పొడగింపు లేదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. దీంతో ఆదివారం నుంచే భారత జవాన్లు మళ్లీ కథనసీమలో కొదమ సింహాలై గర్జిస్తున్నారు. తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని షురూ చేశారు.

జమ్ముకశ్మీర్‌లోని బంధిపోరా జిల్లాలో సోమవారం ఉదయం తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను చేపట్టారు జవాన్లు. పక్కా సమాచారం మేరకు తీవ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని జవాన్లు చుట్టుముట్టారు. తీవ్రవాదులు ప్రతిఘటించడంతో భారత వీరజవాన్లు తమ తుపాకీలకు పనిచెప్పారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు జవాన్ల తూటాలకు బలయ్యారు. ఈ ముష్కరులు ఎవరో ఇంకా గుర్తించలేదని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో మరికొందరు తీవ్రవాదులు ఉండే అవకాశం ఉందన్న సమాచారంతో జవాన్లు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

రంజాన్ సందర్భంగా తీవ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడడంతో కశ్మీర్ లోయలో గస్తీని పెంచారు భారత జవాన్లు. పలుచోట్ల వాహన తనిఖీలు చేపడుతున్నారు.
Published by: Janardhan V
First published: June 18, 2018, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading