Home /News /national /

TWO LET TERRORISTS BEHIND TV ACTOR KILLING KILLED IN ENCOUNTER AT AWANTIPORA PVN

Terrorists Killed : 24 గంటల్లోనే..టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు హతం

టీవీ నటిపై ఉగ్రవాదుల కాల్పులు

టీవీ నటిపై ఉగ్రవాదుల కాల్పులు

Terrorists Behind TV Actor Killing Died : జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.

Terrorists Behind TV Actor Killing Died : జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని జుమాగండ్‌ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ చెప్పారు. కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడు కూడా చనిపోయాడు.

గురువారం రాత్రి శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వారిని షకీర్‌ అహ్మద్‌ వాజా, అఫ్రీన్‌ అఫ్తాబ్‌ మాలిక్‌గా గుర్తించామని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. వారివద్ద ఏకే-47 తుపాకీ, ఓ పిస్తోల్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు .కాగా, అవంతీపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఎల్‌ఈటీ హతమయ్యారని వెల్లడించారు. టీవీ నటి అమ్రీన్‌ భట్‌ హత్యతో వీరికి సంబంధం ఉందని తెలిపారు. 24 గంటల్లోనే హంతకులను అంతమెందించినట్లు చెప్పారు. మొత్తంగా మూడు రోజుల్లో పది మంది ఉగ్రవాదులు మట్టుబెట్టామని వారిలో ఏడుగురు ఎల్‌ఈటీకి చెందినవారుకాగా, ముగ్గురు జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారన్నారు.

ALSO READ  Shocking : కుటుంబాన్ని చితకబాది వారితో మూత్రం తాగించిన గ్రామస్తులు!

కాగా,బూద్గామ్‌ జిల్లాలోని చదూర ప్రాంతంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న టీవీ నటి అమ్రీన్‌ భట్‌(Amreena Bhat),ఆమె మేనల్లుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన అమ్రీన్ భట్ ని హాస్పిటల్ కి తరలించగా.. పరిస్థితి విషమించడంతో ఆమె మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు అని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించారు. అమ్రీన్‌ భట్‌ టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్‌ అయ్యారు. ఇక ఈ ఘటనలో ఆమె మేనల్లుడు ఫర్హాన్‌ జుబీర్‌కు కూడా బుల్లెట్‌ గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. చేతిలో బుల్లెట్ గాయంతో ఉన్న బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. చాదూరా హాస్పిటల్ లో బాలుడు ట్రీట్మెంట్ పొందుతున్నాడని చెప్పారు. అయితే సంఘటన తర్వాత అమ్రీనాను కూడా చదూరా ఆసుపత్రికి తీసుకెళ్లారు మరియు ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్‌లోని SMHS హాస్పిటల్ కి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Encounter, Jammu and Kashmir, Terrorists

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు