హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Flight Accident: ఒకే రన్​వేపై వేగంగా దూసుకొచ్చిన రెండు విమానాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Flight Accident: ఒకే రన్​వేపై వేగంగా దూసుకొచ్చిన రెండు విమానాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Two flights on same runway: దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్ రాత్రి 9:45 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. మరోవైపు దుబాయ్ నుంచి బెంగళూరుకు రావాల్సిన ఎమిరేట్స్ విమానం సైతం అదే సమయంలో బయలుదేరాల్సి ఉంది.

Two flights on same runway: దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్ రాత్రి 9:45 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. మరోవైపు దుబాయ్ నుంచి బెంగళూరుకు రావాల్సిన ఎమిరేట్స్ విమానం సైతం అదే సమయంలో బయలుదేరాల్సి ఉంది.

Two flights on same runway: దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్ రాత్రి 9:45 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. మరోవైపు దుబాయ్ నుంచి బెంగళూరుకు రావాల్సిన ఎమిరేట్స్ విమానం సైతం అదే సమయంలో బయలుదేరాల్సి ఉంది.

  దుబాయ్​ విమానాశ్రయం (Dubai airport) నుంచి భారత్​కు రావాల్సిన విమానాలు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఈ విమానాలు రెండూ ఒకేసారి రన్​వేపై(flights on runway) దిగడమే దీనికి కారణం. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్ రాత్రి 9:45 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. మరోవైపు దుబాయ్ నుంచి బెంగళూరుకు రావాల్సిన ఎమిరేట్స్ విమానం సైతం అదే సమయంలో బయలుదేరాల్సి ఉంది. మరికాసేపట్లో టేకాఫ్ కావాల్సిన ఈ రెండు విమానాలు ఒకే రన్‌వేపైకి వచ్చాయి. ఈ రెండు విమానాలు బయలుదేరే సమయాల మధ్య కేవలం ఐదు నిమిషాల గ్యాప్ మాత్రమే ఉందని ఎమిరేట్స్(Emirates) విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ సంస్థకు చెందిన ఈ విమానాలకు పెను ప్రమాదం తప్పడంతో వందలాది మంది ప్రాణాలు కాపాడినట్లైంది. జనవరి 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  2 నెలలుగా ఇంట్లోనే కూతురు శవం.. పురుగులు పట్టి కంపు కొట్టినా.. బతుకుతుందని తల్లిదండ్రుల ఆశ

  దుబాయ్ నుంచి హైదరాబాద్(Dubai to Hyderabad flights) రావాల్సిన EK-524 విమానం రన్‌వే-30R నుంచి టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అందుకోసం దాని స్పీడ్​ను కూడా పెంచింది. అయితే ఆ సమయంలో అదే రన్​వేపై మెరుపు వేగంతో మరో విమానం రావడం సిబ్బంది గమనించారు. వెంటనే స్పందించిన ఏటీసీ టేకాఫ్‌ను క్యాన్సిల్​ చేయాల్సిందిగా సూచించింది. దీనితో క్షణాల్లో ఆ విమానం వేగం తగ్గించింది. దీనితో దుబాయ్ నుంచి బెంగుళూరుకు రావాల్సిన ఎమిరేట్స్ ఫ్లైట్ EK-568 సురక్షితంగా బయలుదేరిందనివిమానాశ్రయ ప్రతినిధి ఒకరు వివరించారు. అనంతరం హైదరాబాద్‌కు రావాల్సిన ఎమిరేట్స్ విమానం తిరిగి కొద్ది నిమిషాల అనంతరం బయలుదేరి వచ్చింది. యూఏఈ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(AIA) ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్, (AAIS) ద్వారా దర్యాప్తు ప్రారంభించింది. ఘటనలో తీవ్రమైన భద్రతా లోపం ఉందని ప్రాథమికంగా నివేదించింది. మరోవైపు ఎమిరేట్స్ ఎయిర్ సంస్థ సైతం ఘటనను ధృవీకరించింది. భద్రతా ఉల్లంఘన జరిగినట్లు తెలిపింది.

  Israel Weapons: డ్రోన్ కిల్లర్ స్మాష్ డ్రాగన్‌ను ఆవిష్కరించిన ఇజ్రాయెల్..

  "జనవరి 9న దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్ టేకాఫ్‌ను క్యాన్సిల్ చేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) సూచించింది. ఇది విజయవంతమైంది. విమానాలకు ఎటువంటి నష్టం జరగలేదు" అని ఎమిరేట్స్ ఎయిర్ ప్రతినిధి తెలిపారు. అంతేగాక విమానం సిబ్బందిపై అంతర్గత విచారణ కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విమానాలు, ప్రయాణికుల భద్రతే మా ప్రాధాన్యత. ఇతర ఘటనల మాదిరే స్వంతంత్రంగా అంతర్గత సమీక్షను నిర్వహిస్తున్నాము. యూఏఈ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్(AAIS) విచారణలో ఉంది అని తెలిపారు.ఘటన జరిగిన సమయంలో ఎమిరేట్స్​కు చెందిన మరో బోయింగ్-బీ777 విమానం ఒకటి టేకాఫ్​కు సిద్ధంగా ఉంది. సాధారణంగా బోయింగ్ విమానాలు 350-440 సీట్ల వరకు సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఐతే రెండు విమానాలు ఢీకొట్టుకోకుండా.. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

  First published:

  Tags: Dubai, Flight, International, International news

  ఉత్తమ కథలు