ప్రేమ అనేది ఒక స్వచ్ఛమైన ఫీలింగ్. ఒక్కసారి ప్రేమను ఫీల్ అయిన తర్వాత, ఆ అనుభూతిని మర్చిపోలేం. మనం ఎంత ఎక్కువ ప్రేమను పొందినా, అంతకంటే ఇంకా ఎక్కువ ప్రేమ కావాలని కోరుకుంటాం. ప్రేమే మనల్ని బతికిస్తోందని చాలామంది నమ్ముతారు. జీవితాంతం ఇలాంటి ప్రేమ కావాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఇది అందరికీ దొరకదు. ప్రేమ కోసం ప్రతిఒక్కరూ ఎదురు చూడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ ఫీలింగ్ ప్రజల సంతోషానికి అవసరమైన ముఖ్యమైన అనుభూతి అని నిపుణులు చెబుతున్నారు. ప్రేమ ఆనందంతో పాటు శ్రేయస్సుకు కారణమవుతుందని చాలామంది భావిస్తారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందాన్ని కోరుకుంటారు. మన లోపల ఉన్న భావాలు, అనుభూతులు.. మనం బతికినంత కాలం ప్రేమ రూపంలో ఆనందాన్నిస్తాయి. అందుకే సంపూర్ణమైన జీవితానికి ప్రేమ తప్పకుండా ఉండాల్సిందేనని ప్రేమికులు బలంగా కోరుకుంటారు. ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అనుభూతి చెందుతారు. ప్రేమ కేవలం రొమాంటిక్ పార్ట్నర్ నుంచి మాత్రమే రాదు. ఇది స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసినవారి నుంచి కూడా రావచ్చు.
ప్రేమకు ఎంతోమంది ఎన్నో విధాలుగా నిర్వచనాలు ఇచ్చారు. కానీ ఎవరూ దీన్ని పూర్తిగా నిర్వచించలేరు. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత అపార్థం చేసుకునే అంశాల్లో ప్రేమ ఒకటిగా ఉంది. అయితే సాధారణంగా ఈ ఫీలింగ్ ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య పుడుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు అమ్మాయిల మనసుల మధ్య చిగురించింది. ఇద్దరు యువతులు ఇప్పుడు గాఢమైన ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకొి జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడే వీరికి ఇబ్బందులు ఎదురయ్యాయి. వీరి ప్రేమ,పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. కట్ చేస్తే.. తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నారు.
ALSO READ ప్రియుడి కండోమ్స్ కి రంధ్రాలు..ప్రియురాలికి జైలు శిక్ష
బీహార్ రాష్ట్రంలోని పాట్నాలోని ఇంద్రపురికి చెందిన తనిష్క్ శ్రీ(19)..దానాపూర్ ఏరియాకి చెందిన శ్రేయా ఘోష్(22) ఐదేళ్ల క్రితం సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఫ్రెండ్ షిప్ కాస్తా మెల్లగా ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. కొద్ది నెలల్లోనే వీరి మధ్య గాఢమైన ప్రేమ ఏర్పడింది. దీంతో వివాహం చేసుకొని జీవితాం ఒకరికొకరుగా కలిసి ఉండాలనుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు అమ్మాయిలో తమ ఇళ్లల్లో చెప్పారు. అయితే కుటుంబసభ్యులు దీనికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. ఏప్రిల్ 26న ఢిల్లీకి చేరుకున్నారు. అయితే తమ కూతురిని కిడ్నాప్ చేశారంటూ తనిష్క్ శ్రీ కుటుంబసభ్యులుశ్రేయాఘోష్పై నకిలీ కిడ్నాప్ కేసు పెట్టారు. ఈ క్రమంలో తాము కలిసి జీవిస్తే కుటుంబసభ్యులు ఒప్పుకోవట్లేదని పట్నాలోని మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది మహిళా ప్రేమ జంట. అక్కడి పోలీసులు కేసు నమోదుకు నిరాకరించడం వల్ల పట్నా ఎస్ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్వలింగ సంపర్కుల లైంగిక చట్టం ప్రకారం తమకు కలిసి ఉండే హక్కు ఉందని అంటున్నారు. కుటుంబ సభ్యులతో సహా ఎవరికి తమను విడదీసే హక్కు లేదని చెబుతున్నారు.
ALSO READ CM Stalin : సాధారణ ప్రయాణికుడిలా బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించిన సీఎం స్టాలిన్
కాగా,స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించే సెక్షన్ 377ను భారత సుప్రీంకోర్టు 2018లో రద్దు చేసిన విషయం తెలిసిందే. LGBT(లెస్బియన్,గే,బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్లు) హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉందంటూ ఆ వర్గానికి చెందిన పలువురు పోరాటం చేయగా చరిత్రాత్మక తీర్పుతో వారికి స్వాంతన కలిగించింది సుప్రీంకోర్టు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.