Home /News /national /

Delhi Lockdown: ఢిల్లీలో 2 రోజులు లాక్‌డౌన్..? గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Delhi Lockdown: ఢిల్లీలో 2 రోజులు లాక్‌డౌన్..? గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi Air Pollution: ఢిల్లీ గాలి నాణ్యత శనివారం కూడా అత్యంత ప్రమాదకర స్థాయిలోనే నమోదయింది. ఇవాళ ఉదయం ఢిల్లీ AQI రీడింగ్ 473గా ఉంది

    ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi Air Pollution) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది.  దీపావళి మరింత తర్వాత పరిస్థిితి మరింతగా దిగజారింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీచేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి తగ్గించేందుకు అత్యవసర ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. 2 రోజుల పాటు లాక్‌డౌన్ (Delhi Lockdwn) విధించయినా సరే కాలుష్యాన్ని తగ్గించాలని స్పష్టం చేసింది. AQI 500 నుంచి 200 తగ్గించేలా ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు.

    Petrol Price: 10 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ రేట్లు.. ఇలాగే ఉంటుందా?

    ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ ఎన్వీ రమణ  (CJI NV Ramana) నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ''ఢిల్లీ ప్రజలు ఇళ్లల్లోనూ మాస్క్ ధరించే దారుణ పరిస్థితులు ఉన్నాయి. మనం ఇంట్లో కూడా మాస్క్‌లు ధరించాలా? కాలుష్యం నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 500గా ఉన్న AQI (Air Quality Index) ని 200కి తగ్గించాలంటే మన వద్ద ఉన్న మార్గాలేంటి? 2 రోజులు లాక్‌డౌన్ విధిస్తారా? ఇంకేదైనా చేస్తారా? ఏమైనా చేయండి.కాలుష్య నియంత్రణకు అత్యవసర చర్యలు తీసుకోండి. ''' అని సీజేఐ ఎన్వీ రమణ  పేర్కొన్నారు.

    Norovirus: నేను వేరే గ్రహానికి వెళ్లిపోతా మామ.. ఏంటీ రోగాలు.. నోరోవైరస్‌పై జోకులే జోకులు

    సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీ వాయు కాలుష్యంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్, పర్యావరణ మంత్రి గోపాల్ రాజ్, చీఫ్ సెక్రటరీ  హాజరుకానున్నారు. వాయు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.


    ఢిల్లీ గాలి నాణ్యత శనివారం కూడా అత్యంత ప్రమాదకర స్థాయిలోనే నమోదయింది. ఇవాళ ఉదయం ఢిల్లీ AQI రీడింగ్ 473గా ఉంది. SAFAR డేటా ప్రకారం... లోధి రోడ్డు, ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ, పూసా రోడ్డు, ఢిల్లీ ఎయిర్ పోర్టులో 489, 466, 480, 504గా రికార్డయింది. సాధారణంగా AQI 0 నుంచి 50 వరకు ఉంటే.. గాలి నాణ్యత బాగుందని అర్ధం. ఒకవేళ 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరంగానే ఉన్నట్లు భావించాలి. ఇక 101 నుంచి 200గా ఉంటే మధ్యస్థ స్థాయిగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అదే 201 నుంచి 300 వరకు ఉంటే గాలి నాణ్యత క్షీణించిందని అర్ధం. 301 నుంచి 400 వరకు ఉంటే దారుణంగా ఉందని, 401 నుంచి 500 వరకు ఉంటే అత్యంత ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు భావించాలి. ఇప్పుడు ఢిల్లీలో అన్ని చోట్లా 400పైనే నమోదవుతోంది. అంటే ఢిల్లీలో గాలి కాలుష్యం భయంకరంగా ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Air Pollution, New Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు