ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్ కాల్...పాకిస్తాన్‌ తీరుపై విమర్శలు

కశ్మీర్ అంశంలో భారత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఇమ్రాన్‌ ఖాన్‌ను విమర్శించారు మోదీ.

news18-telugu
Updated: August 19, 2019, 9:06 PM IST
ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్ కాల్...పాకిస్తాన్‌ తీరుపై విమర్శలు
మోదీ, ట్రంప్
  • Share this:
ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ కాల్‌చేసి మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలంపై ఇరుదేశాధినేతలు చర్చించారు. సుమారు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయని ప్రధాని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొందరు నేతలు భారత్‌‌కు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నారని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలన, శాంతిస్థాపన ఆవశ్యకతను ఈ సందర్భంగా హైలైట్ చేశారు ప్రధాని మోదీ.

జూన్‌ నెలాఖరులో ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో ఇరు దేశాల మధ్య చర్చకు వచ్చిన అంశాలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ట్రంప్‌తో ప్రస్తావించారు. అమెరికా, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపైనా ఇరువురు నేతలు మాట్లాడారు. పేదరికం, నిరక్షరాస్యతపై పోరాడేందుకు కలిసి వచ్చే దేశాలకు నిబద్ధతతో సహకరిస్తామని నరేంద్ర మోదీ తెలిపారు. 100వ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్‌పై చర్చించారు. ఆఫ్ఘనిస్తాన్‌ అభివృద్ధి, శాంతి పునరుద్ధరణకు భారత్ కట్టబడి ఉందని పునరుద్ఘాటించారు.

కాగా, కశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సమావేశానికి ముందు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. UNSC సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత ట్రంప్‌కు కాల్ చేసి మాట్లాడారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కశ్మీర్ అంశంలో భారత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఇమ్రాన్‌ ఖాన్‌ను విమర్శించారు.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు