దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఆలయం ఒకటి.(Sabarimala)హిందువులు (Hindu)అత్యంత పవిత్ర ఆలయంగా భావించే ఈ దేవస్థానంలో అయ్యప్ప స్వామి(Ayyappa Swamy)కి దైవస్వరూపంగా వెలిశారు. ఏటా ఇక్కడికి అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు(Devotees)వస్తుంటారు. అయితే అత్యంత నియమ, నిష్టలతో కూడిన అయ్యప్ప మాల ధరించిన భక్తులకు 18మెట్లు ఎక్కి ఆలయంలోని అయ్యప్పను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. లక్షలాది మంది స్వాములు వచ్చే ఈ ఆలయంలోకి వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లకు ప్రవేశం లేదు. అయితే ఇక్కడ ఇన్ని ఆచారాలు, కట్టుదిట్టమైన ప్రమాణాలు ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి ప్రధాన పూజారి(chief priest)ని ఎలా నియమిస్తారో ఎవరికి తెలుసా..? ఇద్దరు చిన్న పిల్లలు(Two little children).ఇది ఆశ్చర్యాన్ని కలిగించే వాస్తవం. ఈ నెల 18న అయ్యప్ప స్వామి ఆలయానికి ప్రధాన అర్చకుల నియామకం, లాటరీ పద్ధతిలో బాలుడు, బాలికలను ఎంపిక చేయనున్నారు.
అయ్యప్ప స్వామి ఆలయానికి పూజారి ఎంపిక
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయానికి, మలికప్పురంలోని ఆలయానికి కొత్త ప్రధాన అర్చకుల ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 18న అయ్యప్ప స్వామి ఆలయం, మలికప్పురం ఆలయ ప్రధాన అర్చకుల ఎంపిక జరగనుంది.
పూజారులను ఎన్నుకోబోతున్న పిల్లలు..
ఇద్దరు చిన్న పిల్లలు ఆలయ ప్రధాన పూజారిని ఎన్నుకుంటారు.! అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ రెండు ఆలయాల ప్రధాన అర్చకులను ఇద్దరు చిన్నారులు ఎంపిక చేస్తారు. ఒకటి తరగచి చదువుతున్న విద్యార్ది ఒకరు మరొకరు నాలుగో తరగతి చదువుతున్న విద్యార్ధి కలిసి ఈసారి చీటీలు వేసి లాటరీ ద్వారా పూజారిని ఎంపిక చేయడం జరుగుతుంది.
పూజారులను ఎన్నుకునే పిల్లలు ఎవరు..?
ఈసారి శబరిమల ఆలయ ప్రధాన అర్చకుని ఎంపిక చేసే అవకాశం ఇద్దరు చిన్నారులకు దక్కింది. శబరిమల ఆలయం అర్చకుడ్ని 1వ తరగతి చదువుతున్న బాలుడు కృత్కేశ్ వర్మ, మలికప్పురం దేవి ఆలయం ప్రధాన అర్చకులను 4వ తరగతి విద్యార్థిని పూర్ణమివర్మ ఎంపిక చేయనున్నారు.
ఈ పిల్లలు ఎవరు..?
కృతికేష్ వర్మ 1వ తరగతి విద్యార్థి, పండలం ముండక్కల్ ప్యాలెస్‌కు చెందిన అనూప్ వర్మ మరియు ఎర్నాకులంలోని మంగళ మఠానికి చెందిన పార్వతి వర్మ కుమారుడు. కృతికేష్ ఎర్నాకులంలోని గిరినగర్‌లోని భవన్ విద్యామందిర్‌లో చదువుతున్నాడు. పందళం సాంబ్రికల్కు చెందిన డాక్టర్ గిరీష్ వర్మ, ఎడపల్లి లక్ష్మీ విలాసానికి చెందిన సరిత వర్మ దంపతుల కుమార్తె పౌర్ణమి వర్మ. పౌర్ణమి దోహాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 4వ తరగతి చదువుతోంది.
రాజ కుటుంబ సభ్యులచే పిల్లల ఎంపిక..
2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం, మలికప్పురం ఆలయాలకు ప్రధాన అర్చకులను పిల్లలు లాటరీ పద్ధతిలో ఎన్నుకునే ఆచారం ఉంది. అదేవిధంగా, పందళం ప్యాలెస్‌కు చెందిన సీనియర్ మహారాజా తిరునాల్ రాఘవ వర్మ టికెట్ ఎత్తడానికి కృతికేష్ వర్మ మరియు పౌర్ణమి వర్మ అనే ఇద్దరిని ఎంపిక చేశారు.
అక్టోబర్ 17న తెరుచుకున్న ఆలయం తలుపులు..
శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తులమస్ పూజ కోసం అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు తెరవనున్నారు. ఆలయ తంత్రి కందరారు రాజీవరావు ఆధ్వర్యంలో మేలుశాంతి ఎన్ పరమేశ్వరన్ నంబూతిరి గర్భగుడి తలుపులు తెరిచి దీపాన్ని వెలిగిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala, Sabarimala Temple