హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Senior Citizen FDs: సీనియర్ సిటిజన్లకు బ్యాడ్‌న్యూస్..ఈ బ్యాంకుల్లో స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ బంద్

Senior Citizen FDs: సీనియర్ సిటిజన్లకు బ్యాడ్‌న్యూస్..ఈ బ్యాంకుల్లో స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ బంద్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీనియర్ సిటిజన్ల కోసం బ్యాంకులు గతంలో స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ ప్రవేశపెట్టాయి. అయితే HDFC, IDBI బ్యాంకులు మాత్రం ఇలాంటి స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను 2022 అక్టోబర్ 1 నుంచి ఆపేస్తున్నట్లు ప్రకటించాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Banks To End Senior Citizen Special FD Scheme :  మన దేశంలో అన్ని వర్గాల వారికి సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా నిలుస్తున్నాయి ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed Deposits). నిర్ణీత వడ్డీ హామీ ఉండటం, నష్టభయం లేకపోవడంతో సీనియర్ సిటిజన్లకు(Senior Citizens) ఈ డిపాజిట్లు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఈ క్రమంలో చాలా బ్యాంకులు వీరి కోసం ప్రత్యేకంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ కూడా ప్రకటించించాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసేవారికి బ్యాంకులు మంచి వడ్డీరేటు ఆఫర్ చేశాయి. అయితే వచ్చే నెల నుంచి తమ బ్యాంకుల్లో ఇలాంటి స్పెషల్ స్కీమ్స్‌ను ఆపేస్తున్నట్లు ప్రకటించాయి రెండు ప్రముఖ బ్యాంకులు. ఆ వివరాలు చూద్దాం.

సీనియర్ సిటిజన్ల కోసం HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, IDBI బ్యాంక్, SBI వంటి బ్యాంకులు గతంలో స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ ప్రవేశపెట్టాయి. ఇటీవల SBI 'WECARE' సీనియర్ సిటిజన్స్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ చెల్లుబాటయ్యే వ్యవధిని 2023 మార్చి 31 వరకు పొడిగించింది. అయితే HDFC, IDBI బ్యాంకులు మాత్రం ఇందుకు విరుద్దమైన నిర్ణయాలు తీసుకున్నాయి. సీనియర్ సిటిజన్ల కోసం అందిస్తున్న స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను 2022 అక్టోబర్ 1 నుంచి ఆపేస్తున్నట్లు ప్రకటించాయి.

IDBI బ్యాంక్ స్పెషల్ FD

ప్రైవేట్ రంగ బ్యాంక్ IDBI సీనియర్ సిటిజన్ల కోసం ‘IDBI నమన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్’ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్ 2022 ఏప్రిల్ 20న ప్రారంభమైంది. ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఒక సంవత్సరం నుంచి పదేళ్ల గడువుతో అందించింది. దీని చెల్లుబాటు వ్యవధిని 2022 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. సీనియర్ సిటిజన్లు ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌పై ప్రస్తుతం ఉన్న 0.50% వార్షిక అదనపు రేటు కంటే 0.25% అదనపు వడ్డీ పొందుతారు. అంటే దీనితో మొత్తం 0.75% వరకు అదనపు ప్రయోజనం లభిస్తుంది. అయితే ఈ స్కీమ్‌ వచ్చే నెల నుంచి కొత్త కస్టమర్లకు అందుబాటులో ఉండదు.

Boat capsizes : ఘోర ప్రమాదం..పడవ బోల్తా పడి 77 మంది మృతి

HDFC బ్యాంక్ స్పెషల్ FD రేట్లు

ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ‘సీనియర్ సిటిజన్ కేర్ FD’ని 2020 మే 18న పరిచయం చేసింది. చివరిగా 2022 ఆగస్టు 18న రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ స్కీమ్‌, వడ్డీరేట్లు 2022 సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత నుంచి స్కీమ్ ఎండ్ అవుతుంది. ఈ ఎఫ్‌డీలను బ్యాంకు 5 నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీతో అందించింది. వీటిపై అత్యధికంగా 6.50% వడ్డీరేటును అందించింది. ఇది ప్రామాణిక రేటు 5.75% కంటే 75 బేసిస్ పాయింట్లు ఎక్కువ. సీనియర్ సిటిజన్ కేర్ FDపై ప్రీమెచూర్ విత్‌డ్రా ఆప్షన్‌ కూడా ఉంది.

ఇతర బ్యాంకుల్లో..

ప్రైవేట్ బ్యాంకు ICICI కూడా ‘గోల్డెన్ ఇయర్స్ FD’ పేరుతో స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను అందిస్తోంది. ఈ పథకం 2022 అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ కింద 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీతో డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. లబ్ధిదారులు సంవత్సరానికి ప్రస్తుత అదనపు రేటు 0.50%కి అదనంగా 0.20% అదనపు వడ్డీ రేటును అందుకుంటారు. “SBI వీకేర్” డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లు 30 bps అదనపు ప్రీమియం అందుకుంటారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Fixed deposits, HDFC bank, IDBI Bank, Senior citizens

ఉత్తమ కథలు