చిన్నారులపై పోలీస్ కేసు ఫైల్ అవ్వడం ఎప్పుడైనా చూశారా..? అంటే టీనేజర్లు కాదండోయ్.. సరిగ్గా మాటలు కూడా రాని రెండున్నరేళ్ల బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారంటే నమ్మగలరా..? అది కూడా కరోనా నిబంధనల ఉల్లంఘటన కేసంటా..! వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షరాల నిజం.. అసలు కరోనా అంటే ఏంటో తెలియన పిల్లాడిపై కేసు నమోదు చేయడమేంటో అర్థం కావడం లేదా..? ఇంతకీ ఆ బాలుడు ఏ కరోనా నిబంధనలు ఉల్లంఘించాడు..? చట్టం ప్రకారం రెండున్నరేళ్ల బాలుడిపై కేసు వేయ్యిచ్చా..? సెక్షన్లు ఏం చెబుతున్నాయి..ఇంతకీ ఎంటీ కథ..? ఎక్కడ జరిగిందీ వింత..?
తల్లి ఒడిలో పడుకోని కోర్టుకు:
బీహార్ పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. న్యాయం చేయాలని కోరుతూ ఓ బాలుడు తన తల్లి ఒడిలో కోర్టుకు చేరుకోవడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. ఒడిలో ఉన్న బిడ్డకు బెయిల్ ఇప్పించాలంటూ ఓ తల్లి కోర్టు చుట్టూ తిరిగింది. ఈ సమయంలో వారిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. ఈ కేసు ముఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుజా గ్రామానికి చెందిన కేసుగా సమాచారం. బెగుసరాయ్ పోలీసులు రెండున్నరేళ్ల బాలుడిపై కరోనా వ్యాప్తి ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. 2021లో ఈ కేసు ఫైల్ చేశారు. అప్పటికీ బాలుడి వయసు కేవలం రెండున్నరేళ్లు మాత్రమే. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో పోలీసుల పనితీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు బాలుడి పేరే లేదంటున్న పోలీసులు:
10 ఏప్రిల్ 2021న, ముఫాసిల్ పోలీస్ స్టేషన్ రెండేళ్ల చిన్నారి, అతని తల్లి, తండ్రితో సహా ఎనిమిది మందిలపై క్రిమినల్ కేసు నమోదైంది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి పోలీసులు వేసిన బారికేడ్లను దాటుకుంటూ ఈ ఎనిమిది మంది వెళ్లారని కేసు ఫైల్ చేశారు పోలీసులు. వాచ్‌మ్యాన్ రూపేష్ కుమార్ వాంగ్మూలం మేరకు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిందితులపై ఎపిడెమిక్ డిజాస్టర్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్ బాలుడి పేరును పొరపాటున రిజిస్టర్ చేశామని.. తప్పు తెలిసిన వెంటనే బాలుడి పేరును తొలగించామని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం తెలియని బాలుడి తల్లిదండ్రులు కోర్టుకు వచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారన్నారు. ఇక భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 82 ప్రకారం ఏడేళ్ల లోపు పిల్లలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. మరోవైపు బారికేడ్లను కూడా తాము దాటలేదని.. ఇది తప్పుడు కేసు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కావాలనే ఈ కేసు ఫైల్ చేశారంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.